Monday, February 24, 2025
HomeTrending Newsఆర్మీ హెలికాప్టర్ ఘటనలో ఏపీ వాసి మృతి

ఆర్మీ హెలికాప్టర్ ఘటనలో ఏపీ వాసి మృతి

L/Naik B Sai Teja died:
ఆర్మీ హెలికాప్టర్ దుర్ఘటనలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన లాన్స్ నాయక్ సాయి తేజ కూడా అసువులు బాశారు. సాయి తేజ స్వగ్రామం చిత్తూరు జిల్లా ఎగువ రేగడ. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. పిల్లల చదువుల కోసం మదనపల్లెకు సాయి తేజ కుటుంబం మకాం మార్చారు. అయన ముగ్గురు సోదరుల్లో ఇద్దరు ఆర్మీలో చేరారు. గత వినాయక చవితికి చివరిసారిగా సాయి తేజ స్వగ్రామానికి వచ్చి వెళ్ళారు. 1994 లో జన్మించిన సాయి తేజ 2013 లో ఆర్మీలో చేరారు. బిపిన్ రావత్ కు పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు.

నేటి ఉదయం 8.30 గంటలకు భార్యకు సాయి తేజ ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. 9 గంటల సమయంలో రావత్ తో కలిసి వెళ్ళారు. సాయి తేజ భార్య పేరు శ్యామల, కొడుకు మోక్షజ్ఞ, కూతురు దర్శిని.

Also Read : సిఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి

RELATED ARTICLES

Most Popular

న్యూస్