Sunday, January 19, 2025
Homeసినిమాగట్టి హిట్టు కోసమే సయీ మంజ్రేకర్ వెయిటింగ్! 

గట్టి హిట్టు కోసమే సయీ మంజ్రేకర్ వెయిటింగ్! 

Desperate:  తెలుగు తెరకి ఈ మధ్య కాలంలో చాలామంది  కొత్త హీరోయిన్స్  పరిచయమయ్యారు. వాళ్లలో కృతి శెట్టి .. శ్రీలీల మాత్రమే కాస్త దూకుడు చూపిస్తున్నారు. కేతిక శర్మ .. సంయుక్త మీనన్ … మీనాక్షి చౌదరి వంటి కొంతమంది హీరోయిన్లు బరిలోకి దిగిపోయారుగానీ, యూత్ పై పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. తమిళ .. మలయాళ భాషల నుంచి వచ్చే ముద్దుగుమ్మల సంగతి అటుంచితే, ఇటీవల కాలంలో టాలీవుడ్ కి బాలీవుడ్ భామల వలస కూడా బాగా పెరిగింది. కియారా  .. దీపికా .. అలియా .. అనన్య .. ఇలా చాలామంది వరుసబెట్టేస్తున్నారు.

ఆ వరుసలో టాలీవుడ్ ను పలకరించిన మరో బ్యూటీగా సయీ మంజ్రేకర్ కనిపిస్తుంది. వరుణ్ తేజ్ ‘గని’ సినిమాతో ఈ సుందరి తెలుగు తెరకి పరిచయమైంది. ఆ సినిమాలో ఆమె చాలా అందంగా కనిపించింది .. భారీ అందాల భామగా నిండుగా అనిపించింది. అయితే ఆ సినిమాలో రొమాన్స్ పాళ్లు చాలా తక్కువ. అందువలన ఆమె గ్లామర్ వైపు నుంచి ఆడియన్స్ ను అలరించే ప్రయత్నమే జరగలేదు. దాంతో ఆ సినిమా ఆమె కెరియర్ కి ఎంతమాత్రం హెల్ప్ కాలేకపోయింది. ఆ సినిమా సక్సెస్ కాకపోవడం ఆమెను మరింత నిరాశపరిచింది.

ఆ తరువాత సినిమాగా ఆమె చేసిన ‘మేజర్‘ జూన్ 3వ తేదీ న విడుదలవుతోంది. అడివి శేష్ హీరోగా నటించిన ఈ సినిమా, మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్. శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహించిన ఈ సినిమాకి శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని సమకూర్చాడు. ఈ సినిమాలో ఆమె కథానాయకుడికి భార్య పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే బయటికి వచ్చిన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ ఇస్తుందనే నమ్మకంతో ఆమె ఉంది. ఆమె నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందనేది చూడాలి.

Also Read : మేజర్’ ప్రత్యేకత అదే: అడివి శేష్  

RELATED ARTICLES

Most Popular

న్యూస్