Saturday, March 14, 2026
HomeసినిమాDevara: 'భైరా' పాత్రలో సైఫ్ అలీ ఖాన్

Devara: ‘భైరా’ పాత్రలో సైఫ్ అలీ ఖాన్

ప్రతిష్టాత్మక ‘ఆర్ఆర్ఆర్’  తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తోన్న చిత్రం ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో.. యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా… మిక్కిలినేని సుధాకర్ నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్న ఈ సినిమాలో అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ హీరోయిన్ గా, బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నారు. హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీ లో ఎన్టీఆర్, సైఫ్ లపై కీలక సన్నివేశాలు చిత్రీకరించారు.

అయితే నేడు సైఫ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన పాత్రను పరిచయం చేస్తూ ఓ ప్రత్యేక పోస్టర్ ను విడుదల చేశారు. సముద్ర తీర ప్రాంతం ఇతివృత్తంగా సాగుతోన్న ఈ సినిమాలో టైటిల్ రోల్ ‘దేవర’ గా ఎన్టీఆర్ నటిస్తుండగా, నేడు సైఫ్   ‘భైర’ పాత్ర  పోస్టర్ ను ఆవిష్కరించారు. ఎన్టీఆర్ తన సామాజిక మాధ్యమాల ఖాతాల్లో ఈ పోస్టర్ షేర్ చేస్తూ ‘ హ్యాపీ బర్త్ డే సైఫ్ సార్’ అంటూ శుభాకాంక్షలు తెలియజేశారు. రత్న వేలు సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ స్వరాలు సమకూరుస్తున్నారు.

వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా  ఏప్రిల్ 5న సినిమాను విడుదల చేస్తున్నట్లు గతంలోనే అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular