Thursday, March 19, 2026
Homeసినిమావెంకీ 75వ చిత్రం 'సైంధవ్'

వెంకీ 75వ చిత్రం ‘సైంధవ్’

విక్టరీ వెంకటేష్ కెరీర్ లో ప్రతిష్టాత్మకమైన 75వ చిత్రాన్ని అఫిషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ మూవీకి శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి ‘సైంధవ్’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఇది పాన్ ఇండియా మూవీ కావడం విశేషం. ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్నారు. ‘దృశ్యం 2’, ‘నారప్ప’, ‘ఎఫ్ 3’ చిత్రాలతో ఆకట్టుకుని ఫుల్ ఫామ్ లో ఉన్న వెంకీ 75వ సినిమాని భారీ బడ్జెట్ తో యాక్షన్ మూవీగా రూపొందిస్తున్నారు. వెంకీ రఫ్ లుక్ .. ఆయన గన్ పట్టుకున్న తీరు చూస్తుంటేనే.. ఇది భారీ యాక్షన్ మూవీ అనే విషయం అర్థమవుతోంది.

సంతోష్ నారాయణ్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. పాన్ ఇండియా మూవీగా తెలుగుతో పాటు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లోనూ ఈ మూవీని భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీ అనౌన్స్ మెంట్ రోజునే గ్లింప్స్ రిలీజ్ చేశారు. పోర్ట్ లో హీరో ఇంట్రడక్షన్ సీన్ ని గ్లిమ్స్ లో చూపిస్తూ తన క్యారెక్టర్ ని పరిచయం చేశారు. పోర్ట్ ఏరియాలో వున్న కంటైనర్ ల మధ్య దేని కోసమో వెతుకుతూ చేతిలో ఏకే 47 గన్ ని పట్టుకుని మరో చేతిలో క్యాప్సిల్ ని పట్టుకుని వెంకీ కనిపిస్తున్న తీరు సినిమా పై అంచనాల్ని పెంచేస్తోంది. నేనిక్కడే వుంటాన్రా..ఎక్కడికి వెళ్లను..రమ్మను.. అంటూ తన ముందు గుట్టగా పడివున్న విలన్ బ్యాచ్ ని ఉద్దేశించి వెంకటేష్ చెబుతున్న డైలాగ్ లు ఆసక్తికరంగా వున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular