Saturday, January 18, 2025
HomeసినిమాSaindhav: వెంకీ సైంధవ్ ప్లాన్ వర్కవుట్ అయ్యేనా..?

Saindhav: వెంకీ సైంధవ్ ప్లాన్ వర్కవుట్ అయ్యేనా..?

వెంకటేష్ నటిస్తున్న 75వ చిత్రం సైంధవ్. ఈ చిత్రానికి శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. కెరీ్ర లో లాండ్ మార్క్ ఫిల్మ్ కావడంతో అత్యంత ప్రతిష్టాతక్మంగా నిర్మిస్తున్నారు. దీనిని భారీ పాన్ ఇండియా మూవీగా రూపొందిస్తున్నారు. షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి పక్కా ప్లానింగ్ తో  చాలా ఫాస్ట్ గా షూటింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీలంకలో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ షెడ్యూల్ తో దాదాపు షూటింగ్ పూర్తవుతుంది. ఈ మూవీని ప్రారంభించక ముందే డిసెంబర్ 22న విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు.

డిసెంబర్ లో ఎందుకు రిలీజ్ చేయాలి అనుకుంటున్నారు అంటే.. హిట్ సినిమా ఫిబ్రవరిలో రిలీజ్ అయ్యింది. హిట్ 2 సినిమా డిసెంబర్ లో రిలీజ్ అయ్యింది. హిట్ కంటే హిట్ 2 సినిమా పెద్ద సక్సెస్ సాధించింది. అప్పటి నుంచి డిసెంబర్ నెలను శైలేష్ కొలను సెంటిమెంట్ గా ఫీలవుతున్నారట. పైగా హిట్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన రాజమౌళి ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో హిట్ సిరీస్ రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేయని సలహా ఇచ్చారు. జక్కన్న అలా సలహా ఇవ్వడంతో శైలేష్ ప్రతి సంవత్సరం డిసెంబర్ లో తన సినిమా రిలీజ్ చేయాలి అనుకుంటున్నాడట.

పైగా సెంటిమెంట్ కూడా కలిసొస్తుందనే ఉద్దేశ్యంతో సైంధవ్ మూవీని కూడా డిసెంబర్ లో రిలీజ్ చేయాలి అనేది ప్లాన్. మెడికల్ మాఫియా నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్, రుహాని శర్మ, బాలీవుడ్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధికి, కోలీవుడ్ యాక్టర్ ఆర్య తదితరులు నటిస్తున్నారు. నిర్మాణపరంగా ఏమాత్రం రాజీపడకుండా నిహారిక ఎంటర్ టైన్మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. త్వరలోనే ఈ మూవీ గ్లింప్స్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మరి… సైంధవ్ సెంటిమెంట్ ప్లాన్ వర్కవుట్ అవుతుందో లేదో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్