Wednesday, March 18, 2026
Homeసినిమాగురువారం నుంచి ‘సైంధవ్’ రెగ్యులర్ షూటింగ్

గురువారం నుంచి ‘సైంధవ్’ రెగ్యులర్ షూటింగ్

విక్టరీ వెంకటేష్ ల్యాండ్‌మార్క్ 75వ చిత్రం ‘సైంధవ్’. టాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో నిహారిక ఎంటర్‌ టైన్‌మెంట్ బ్యానర్‌ పై వెంకట్ బోయనపల్లి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఉగాదిని పురస్కరించుకొని మేకర్స్ అప్‌ డేట్‌ ఇచ్చారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ 23 నుంచి ప్రారంభం కానుంది. సినిమా టైటిల్ పోస్టర్, గ్లింప్స్ లో వెంకటేష్ యాక్షన్ ప్యాక్డ్ గెటప్‌ లో కనిపించారు. తుపాకీ పట్టుకుని ఫెరోషియస్ గా నడుస్తూ కనిపించారు.

సైంధవ్ భారీ బడ్జెట్‌తో భారీ స్థాయిలో రూపొందుతోంది. వెంకటేష్‌ కెరీర్లో ఇది అత్యంత కాస్ట్లీ మూవీ. బాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖీ ఈ చిత్రంతో టాలీవుడ్‌ లోకి అడుగుపెడుతున్నారు. అలాగే పలువురు ప్రముఖ నటీనటులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ చిత్రం కోసం పని చేస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ఎస్ మణికందన్ కెమెరామెన్ గా, గ్యారీ బిహెచ్ ఎడిటర్ గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి కిషోర్ తాళ్లూరు సహ నిర్మాత. ఇతర నటీనటులను మేకర్స్ త్వరలో అనౌన్స్ చేస్తారు. సైంధవ్ అన్ని దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ విడుదల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular