Friday, November 22, 2024
HomeTrending NewsSajjala: వారు పొలిటికల్ డాక్టర్లా?: సజ్జల అనుమానం

Sajjala: వారు పొలిటికల్ డాక్టర్లా?: సజ్జల అనుమానం

చంద్రబాబు కోర్టుకు సమర్పించిన వైద్య నివేదికలు దారుణంగా ఉన్నాయని, దానిలో పేర్కొన్న వ్యాధులు చూసిన తరువాత ఎవరైనా ఆయనపై సానుభూతి చూపాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి వ్యాఖ్యానించారు. దీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసి మరోసారి ఆ పదవి చేపట్టాలని అనుకుంటున్న నాయకుడిగా ఉన్న చంద్రబాబు ఆరోగ్య నివేదికపై అందరూ సునిశితంగా పరిశీలన చేయాలని అన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల మీడియాతో మాట్లాడారు.

జైలుకు వెళ్ళక ముందువరకూ తాను నవయువకుడినని, ఎంతో ఆరోగ్యవంతుడినని చెప్పుకున్నారని… చర్మ సంబంధ వ్యాధులు ఉన్నాయని కోర్టుకు చెప్పి బెయిల్ తీసుకున్నారని, ఆ తర్వాత 14 గంటలు ర్యాలీ నిర్వహించారని గుర్తు చేశారు. కాటరాక్ట్ ఆపరేషన్ చేయకపోతే కళ్ళు పోతాయని, గుండె సంబంధ వ్యాదులు ఉన్నాయని చెప్పి రాజకీయపరమైన కార్యక్రమాల్లో పాల్గొన్నారని ఆరోపించారు. కానీ ఇప్పుడు వైద్యులు ఇప్పుడు ఇచ్చిన నివేదిక చూస్తే… అసలు ఇది ఇచ్చిన వారు నిజమైన వైద్యులా లేక పొలిటికల్ డాక్టర్లా అన్న అనుమానం కలుగుతోందని… బాబు వెంట ఎప్పుడూ ఓ అంబులెన్స్ ఉండాలని వారు చెప్పడమేమిటని సజ్జల విస్మయం వ్యక్తం చేశారు. అంటే రాజకీయపరమైన కార్యకలాపాలు చేయాలని  వైద్యులు ఎలా చెబుతారని ప్రశ్నించారు.

బాబు గుండెకు సంబంధించి నివేదికలోని గణాంకాలు భయంకరంగా ఉన్నాయని, దీనిపై ఓ కార్డియాలజిస్ట్ ను తాను సంప్రదిస్తే ఆ సంఖ్య నిజమే అయితే అత్యంత సీరియస్ గా పరిగణించాల్సి ఉంటుందని  చెప్పారని సజ్జల వివరించారు. బాబు మెడికల్ రిపోర్ట్ లపై ఆల్ ఇండియా మెడికల్ బోర్డులో చర్చ జరగాలని అభిప్రాయపడ్డారు.  అనారోగ్య కారణాలతో, తప్పుడు నివేదికలతో రెగ్యులర్ బెయిల్ పొందాలని, లేదా ప్రస్తుతం ఉన్న కండీషనల్ బెయిల్ కొనసాగించాలని చూస్తున్నారని సజ్జల విమర్శించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్