Wednesday, March 11, 2026
HomeTrending Newsబిజెపిది ఆత్రం మాత్రమే: సజ్జల

బిజెపిది ఆత్రం మాత్రమే: సజ్జల

టిడిపి, బిజెపి నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వంపై విమర్శలు చేయడంలో బిజెపి, టిడిపి, జన సేన పార్టీలు ఒకేలా వ్యవహరిస్తున్నాయని అన్నారు. బిజెపి నేతలు వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నరని, వారి వ్యాఖ్యలు రాజకీయ దివాళాకోరుతనాన్ని తేటతెల్లం చేస్తున్నాయని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం, బిజెపి పాలిత రాష్ట్రాల్లో చేస్తున్న అప్పులపై ఎందుకు స్పందించారని, అవి కనిపించడం లేదా అని సజ్జల నిలదీశారు. రాష్ట్రంలో తొందరగా ఎదగాలన్న కంగారుతనం బిజెపిలో కనిపిస్తోందని, కానీ వారిది ఆత్రం తప్ప మరొకటి కాదని సజ్జల వ్యాఖ్యానించారు.

పులిచింతల క్రెడిట్ వైఎస్సార్ కు ఇచ్చినందుకు సంతోషమని, అయితే 2004లో నాటి చంద్రబాబు ప్రభుత్వమే బొల్లినేనికి సంబంధించిన సంస్థకు కాంట్రాక్టు అప్పగించారని, వైఎస్ హయాంలో 90 శాతం పనులు పూర్తయ్యాయని, తరువాత బాబు హయాంలోనే గేట్లు పెట్టారని సజ్జల వెల్లడించారు. ప్రాజెక్టు నాణ్యతపై 2015లో క్వాలిటీ కమిటీ నివేదిక ఇస్తే దాన్ని పట్టించుకోకుండా బుట్టదాఖలు చేశారని విమర్శించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular