Sunday, January 19, 2025
HomeTrending Newsఅది దివాళాకోరు ఆరోపణ: కంటైనర్ పై సజ్జల

అది దివాళాకోరు ఆరోపణ: కంటైనర్ పై సజ్జల

ఎన్నికల కమిషన్ నుంచి అధికారికంగా అనుమతి తీసుకొని వినియోగిస్తున్న పాంట్రీ కార్ వాహనంపై టిడిపి, కొన్ని మీడియా సంస్థలు చేసిన ఆరోపణలను వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి తీవ్రంగా ఖండించారు. అది ఆర్టీసీకి చెందిన వాహనమని AP 16z 0363 నంబర్ తో రిజిస్టర్ అయిన దీన్ని అద్దె చెల్లించి వినియోగించుకుంటున్నామని వివరించారు. సిఎంగా ఉన్నప్పుడు అధికారికంగా ఆయన వెంట ఉంటుందని… కోడ్ వచ్చిన తరువాత అద్దె చెల్లించి దాన్ని వినియోగించడం సర్వ సాధారణంగా జరిగేదే అని… దీనిపై విమర్శలు చేయడం హేయమని విమర్శించారు.  ఈ మేరకు తాము ఈసీకి దరఖాస్తు చేసిన లేఖ, ఈసీ ఇచ్చిన అనుమతి పత్రాలను సజ్జల మీడియాకు ప్రదర్శించారు.

తప్పుడు ఆరోపణలు చేసి, ఈసీకి ఫిర్యాదులు ఇచ్చి…. తమకు మద్దతిచ్చే మీడియాలో నానా యాగీ చేసి చేతులు దులుపుకోవడం తెలుగుదేశం పార్టీ దివాళాకోరుతనమని సజ్జల విమర్శించారు. వారి దగ్గర మాట్లాడడానికి సబ్జెక్ట్ ఏమీ లేదని, ప్రజలు నమ్మడం లేదని అందుకే  కంటైనర్, డబ్బులు అంటూ ఇలాంటి అభాండాలు వేస్తున్నారని, వారి బతుకంతా అంతే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దింపుడు కళ్ళెం ఆశలు కూడా వారు కోల్పోయారన్నారు. ప్రజలకు ఏం చేయబోతున్నారో చెప్పాలి కానీ ఇలాంటి పనులు చేయడం తగదన్నారు.

వారంరోజులపాటు ఢిల్లీలో తిరిగి వారి దర్శనంకోసం పాకులాడి వారితో పొత్తు పెట్టుకున్నారని, కానీ ఇప్పుడు మాత్రం మోడీ, అమిత్ షా లకు తెలుగు రాదనే ఉద్దేశంతో వాళ్ళు అడిగితేనే తాము కూటమిలో చేర్చుకున్నమంటూ మాట్లాడి ఉంటారని ఎద్దేవా చేశారు.

గతంలో బిజెపి తమ కార్యకర్తలనే ఎన్నికల్లో పోటీకి దింపేదని కానీ ఈసారి మాత్రం టిడిపి నుంచి వచ్చిన వారికి,  టిడిపి తరఫున బిజెపిలో కొనసాగుతున్న వారికి టిక్కెట్లు కేటాయించిందని సజ్జల అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్