Irrelevant: కేటిఆర్ అయినా మరే రాష్ట్రం మంత్రులైనా, సిఎంలైనా వారి రాష్ట్రం గురించి, వారి పరిస్థితుల గురించి వారు మాట్లాడుకోవాలని కానీ అనవసర వ్యాఖ్యలు చేయడం సరికాదని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హితవు పలికారు. విభజన అన్యాయంగా జరిగిందని, రెండు రాష్ట్రాల మధ్య ఇప్పటికీ ఆస్తుల విషయం ఇంకా తేలలేదని, రాజధాని లేకుండా బైటకు వచ్చామని గుర్తు చేశారు.
జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత దూరదృష్టితో అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరిస్తున్నామని సజ్జల పేర్కొన్నారు. హైదరాబాద్ కూడా సమైక్య ఆంధ్రప్రదేశ్ లోనే సమగ్ర అభివృద్ధి జరిగిదని, వైఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత పివి ఎక్స్ ప్రెస్ హైవే, రింగ్ రోడ్, ఎయిర్ పోర్ట్ వచ్చాయని అన్నారు. విద్య, వైద్యం లాంటి ఎన్నో రంగాల్లో ఏపీ మిగిలిన రాష్ట్రాల కంటే ఎన్నో రెట్లు మెరుగ్గా ఉందన్నారు. కోవిడ్ సమయంలో ప్రజల పట్ల బాగా స్పందించామన్నారు.
వీటిని ఇవి రాజకీయ ప్రేరేపిత వ్యాఖలుగా తాను భావించడంలేదని, ఉద్దేశపూర్వకంగా చేసి ఉండరని, నర్మగర్భంగా చేసి ఉంటారని సజ్జల అభిప్రాయపడ్డారు. విద్యుత్ సమస్య దేశవ్యాప్తంగా ఉందని, తెలంగాణా లో కూడా కోతలు మొదలయ్యాయని, ఈరోజు ఢిల్లీ కూడా మెట్రో రైల్ కు విద్యుత్ అందివ్వలేమని చెప్పిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. కేటిఆర్ వ్యాఖ్యలపై టిడిపి గగ్గోలు పెడుతోందని విమర్శించారు. ఎవరెన్ని విమర్శలు చేసినా రాష్ట్ర ప్రజలకు అంతా తెలుసని సజ్జల అన్నారు.
Also Read : ఆ అవసరం మాకేంటి? సజ్జల