Sunday, January 19, 2025
Homeసినిమామెగా హీరోకు జంటగా అఖిల్ హీరోయిన్.?

మెగా హీరోకు జంటగా అఖిల్ హీరోయిన్.?

అఖిల్ నటించిన చిత్రం ‘ఏజెంట్’.  డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కించిన మూవీ ద్వారా తెలుగు తెరకు సాక్షి వైద్య పరిచయం అయ్యింది. అయితే.. సినిమా డిజాస్టర్ అవ్వడంతో ఈ అమ్మడుకు అవకాశాలు అంతగా రాలేదు కానీ.. లేకపోతే ఈపాటికి ఫుల్ బిజీ అయ్యేది. జనరల్ గా ఫస్ట్ సినిమా ఫ్లాప్ అయితే.. హీరోయిన్ అయినా హీరో అయినా సెకండ్ మూవీ ఛాన్స్ కోసం చాలా కష్టపడాల్సివుంటుంది కానీ.. ఏజెంట్ బ్యూటీ సెకండ్ ఛాన్స్ దక్కించుకుందని.. అది కూడా మెగా హీరోతో నటించే ఛాన్స్ దక్కించుకుందని టాక్ వినిపిస్తుంది.

ఇంతకీ ఏ మెగా హీరోతో నటిస్తుందంటే.. సాయిధరమ్ తేజ్ తో అని సమాచారం. విరూపాక్ష సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించి తేజ్ ఫామ్ లోకి వచ్చాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో కలిసి ‘బ్రో’ సినిమాలో నటిస్తున్నారు. సముద్రఖని డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ సినిమా జులై 28న విడుదల కానుంది. అయితే.. కొత్త దర్శకుడు జయంత్ చెప్పిన డిఫరెంట్ స్టోరీకి తేజ్ ఓకే చెప్పాడట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఈ సినిమాలో తేజ్ కు జంటగా సాక్షి వైద్య నటించనున్నట్టు సమాచారం. మొత్తానికి  ఈ అమ్మడు కెరీర్ ఆరంభంలోనే మెగా క్యాంప్లో పడింది. సక్సెస్ అయితే.. అక్కడ మంచి లైఫ్ ఉంటుంది. మెగా క్యాప్ లోనే నలుగురైదుగురు హీరోలున్నారు. సొంత నిర్మాణ సంస్థలున్నాయి. ఆహా అనే ఓటీటీ కూడా ఉంది కాబట్టి ఈ సినిమాతో అయినా సాక్షి వైద్య సక్సెస్ సాధించి బిజీ అవుతుందేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్