Sunday, January 19, 2025
HomeసినిమాSakshi Vaidya: సాక్షి వైద్య ఆ టాక్ ను బ్రేక్ చేస్తుందా? 

Sakshi Vaidya: సాక్షి వైద్య ఆ టాక్ ను బ్రేక్ చేస్తుందా? 

సాక్షి వైద్య ‘ఏజెంట్’ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమవుతోంది. ఇంతకుముందు ఆమె మోడలింగ్ చేసిందిగానీ, హీరోయిన్ గా కెమెరా ముందుకు వచ్చింది మాత్రం ఈ సినిమాతోనే. ఈ ముంబై బ్యూటీకి ఫస్టు ఛాన్స్ ఇంతటి భారీ బడ్జెట్ సినిమా నుంచి వెళ్లడం నిజంగా అదృష్టమే. ఆకర్షణీయమైన కళ్లతో … నాజూకుదనంతో ఈవెంట్స్ లో ఆకట్టుకుంటూ వచ్చింది. ఇక తెరపై ఎలా మెరుస్తుందనేది చూడటానికి ప్రేక్షకులు ఉత్సాహాన్ని చూపుతున్నారు.

అయితే అఖిల్ సినిమాలతో ఇంతకుముందు ఇండస్ట్రీకి వచ్చిన హీరోయిన్స్ ఆ తరువాత రాణించలేకపోయారనే ఒక టాక్ ఉంది. ‘అఖిల్’ సినిమాతోనే సాయేషా సైగల్ తెలుగు తెరకి పరిచయమైంది. మెరుపుతీగలాంటి ఈ సుందరికి ఆ సినిమా నిరాశనే మిగిల్చింది. దాంతో ఇక్కడ మరో సినిమా చేసే ఛాన్స్ ఆమెకి లేకుండా పోయింది. ఆ తరువాత ‘హలో’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కల్యాణి ప్రియదర్శన్ పరిస్థితి కూడా అదే.

ఇక ఇప్పుడు సాక్షి వైద్య కూడా అఖిల్ సినిమాతోనే ఎంట్రీ ఇస్తోంది. ఆమె చేసిన ‘ఏజెంట్’ సినిమా ఈ నెల 28వ తేదీన థియేటర్లకు రానుంది. ‘పొన్నియిన్ సెల్వన్ 2’ వంటి భారీ సినిమాతో ‘ఏజెంట్’ తలపడుతుండటం విశేషం. సురేందర్ రెడ్డి టేకింగ్ .. అఖిల్ ఎంచుకున్న కొత్త జోనర్ .. లుక్ తోనే ఆయనకి పడుతున్న మార్కులు చూస్తుంటే, ఈ సినిమా హిట్ కావడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదే జరిగితే ఇంతవరకూ షికారు చేస్తున్న టాక్ ను సాక్షి వైద్య బ్రేక్ చేసినట్టే అవుతుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్