Thursday, March 19, 2026
Homeసినిమాకొత్త హీరోయిన్ గా ఇక సాక్షి వైద్య వంతు!

కొత్త హీరోయిన్ గా ఇక సాక్షి వైద్య వంతు!

తెలుగు తెర అందమైన కథానాయికల అక్షయ పాత్రలాంటిది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త కథానాయికలు పుట్టుకొస్తుంటారు. గ్లామర్ తో పాటు కాస్త అభినయం .. ఇంకాస్త లౌక్యం ఉన్నవారు ఇక్కడ నిలబడగలుగుతుంటారు. తెలుగు తెరకి ఈ మధ్య కాలంలో ఆషిక రంగనాథ్ .. అనిఖ సురేంద్రన్ .. గౌరీ కిషన్ కథానాయికలుగా పరిచయమయ్యారు. తొలి ప్రయత్నంలోనే ఆశించిన స్థాయి సక్సెస్ అందకపోయినా, వాళ్లకి మరికొన్ని సినిమాలు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

ఈ నేపథ్యంలోనే సాక్షి వైద్య తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. మహారాష్ట్రలో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ, కాలేజ్ రోజుల నుంచే మోడలింగ్ చేస్తూ వచ్చింది. తెలుగులో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ‘ఏజెంట్’ సినిమాలో అఖిల్ జోడీగా నటించింది. ఏప్రిల్ 28వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా నుంచి రీసెంట్ గా వదిలిన లిరికల్ సాంగ్ వీడియోలో ఆమె అందంగానే మెరిసింది. ఈ సినిమా ఆమె కెరియర్ కి ఎంతవరకూ హెల్ప్ అవుతుందనేది చూడాలి.

అఖిల్ చేసిన ‘ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ హిట్ అనిపించుకున్నప్పటికీ ఆయన స్థాయికి అది చాలదు. ఆయన నుంచి అభిమానులు బ్లాక్ బస్టర్ హిట్ ను కోరుకుంటున్నారు. అందువలన ఈ సినిమాతో వారి ముచ్చట తీర్చాలనే ఉద్దేశంతోనే ఆయన ఉన్నాడు. ఇక డైరెక్టర్ గా సురేందర్ రెడ్డికి కూడా ఈ సినిమా హిట్ చాలా అవసరమే. అందువల్లనే వాళ్లంతా ఏప్రిల్ 28పైనే ఆశలు పెట్టుకున్నారు. అభిమానులు కూడా అప్పటివరకూ వెయిట్ చేయవలసిందే.

Also Read : ‘ఏజెంట్’ ఆ పోటీని తట్టుకుని విజేతగా నిలుస్తాడా..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular