Saturday, January 18, 2025
Homeసినిమాశ్రుతి హాసన్ గ్రాఫ్ పెంచే 'సలార్' 

శ్రుతి హాసన్ గ్రాఫ్ పెంచే ‘సలార్’ 

శ్రుతిహాసన్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి చాలాకాలమే అయింది. తెలుగు, తమిళ సినిమాలకి  సంబంధించి  ఆమెకి మంచి క్రేజ్ ఉంది. ఇక హిందీలోను గుర్తింపు ఉంది. శ్రుతి హాసన్ మంచి డాన్సర్ .. మంచి సింగర్ కూడా. అడపాదడపా ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూనే ఉంటుంది. సినిమాలకంటే ఆల్బమ్స్ చేయడమే తనకి ఇష్టమని చెబుతూ ఉంటుంది కూడా. గ్లామర్ వైపు నుంచి .. యాక్టింగ్ వైపు నుంచి శ్రుతి హాసన్ కి వంకబెట్టనవసరం లేదు. ఆమెను అభిమానులు ఆరాధిస్తూనే వస్తున్నారు.

అయితే శ్రుతిహాసన్ కెరియర్ ను పరిశీలిస్తే, ఆమె సిన్సియర్ గా ఫోకస్ చేసినట్టుగా కనిపించదు. అలాగే ఇతర హీరోయిన్స్ తో పోటీపడి అవకాశాలను అందుకోవడానికి ట్రై చేస్తున్నట్టుగా కూడా అనిపించదు. తనకి వచ్చిన అవకాశాలను చేసుకుంటూ వెళుతూ ఉంటుంది అంతే. ఈ నేపథ్యంలో గ్యాప్ వచ్చినా ఆమె లైట్ గానే తీసుకుంటోంది. అలాంటి శ్రుతి హాసన్ చేసిన ‘సలార్’ సినిమా ఈ నెల 22వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇది ప్రభాస్ సినిమా .. పైగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడం వలన  ఒక రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. ఫస్టు డే నుంచే ఈ సినిమా రికార్డులు మొదలవుతాయని అంటున్నారు. అలాంటి సినిమాలో ప్రభాస్ సరసన శ్రుతిహాసన్ కనిపించనుంది. ఈ మధ్య కాలంలో చెప్పుకోదగిన సినిమాలేం చేయని శ్రుతి హాసన్ కి ఈ సినిమా బూస్ట్ ఇవ్వడం ఖాయమని అనుకోవచ్చు. ఈ సినిమా తరువాత ఆమె కెరియర్ గ్రాఫ్ ఫాస్టుగా పరిగెడుతుందని కూడా భావించవచ్చు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్