Friday, September 20, 2024
Homeసినిమా'సలార్' టీజర్ కు ముహుర్తం ఫిక్స్ అయ్యిందా..?

‘సలార్’ టీజర్ కు ముహుర్తం ఫిక్స్ అయ్యిందా..?

ప్రభాస్ ఇటీవల ఆదిపరుష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఓంరౌత్ డైరెక్ట్ చేసిన ఆదిపురుష్ మూవీ పై విమర్శలు వచ్చినప్పటికీ కలెక్షన్స్ మాత్రం బాగానే వస్తున్నాయి. ఇక ప్రభాస్ నుంచి రానున్న నెక్ట్స్ మూవీ ‘సలార్’. ఈ భారీ పాన్ ఇండియా మూవీకి ప్రశాంత్ నీల్ డైరెక్టర్. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ కు జంటగా శృతి హాసన్ నటిస్తుంది. ఈ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పటి నుంచి సలార్ సినిమా పై అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

సలార్ టీజర్ ను ఆదిపురుష్ మూవీతో పాటు రిలీజ్ చేస్తారని ప్రచారం జరిగింది కానీ.. అది నిజం కాలేదు. సలార్ సినిమాకి సంబంధించి వర్క్ చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. దాదాపు షూటింగ్ పూర్తయ్యింది. మరి.. టీజర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే.. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగష్టు 15న టీజర్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇది భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ కావడంతో ప్రభాస్ అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ప్రభాస్, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలిసి సినిమా చేయడంతో ఆకాశమే హద్దు అనేలా అంచనాలు ఉన్నాయి.

ఇందులో ప్రభాస్ రెండు విభిన్నమైన పాత్రలను చేస్తున్నట్లు తెలిసింది. అలాగే పృథ్వీ రాజ్ సుకుమారన్, జగపతి బాబు ఇందులో విలన్లుగా నటిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రాన్ని హొంబళే ఫిల్మ్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. త్వరలో సలార్ అప్ డేట్స్ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ కోసం ఇండియాలోనూ, ఓవర్ సీస్ లోనూ భారీగా పోటీ ఏర్పడింది. ఇప్పటి వరకు ఉన్న రికార్డులు అన్నింటిని సలార్ బ్రేక్ చేయడం ఖాయం అంటున్నారు సినీ పండితులు. మరి.. సలార్ చరిత్ర సృష్టిస్తుందేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్