Sunday, January 19, 2025
Homeసినిమా'సలార్' టీజర్ రన్ టైమ్ లాక్ అయ్యిందా..?

‘సలార్’ టీజర్ రన్ టైమ్ లాక్ అయ్యిందా..?

ప్రభాస్, ప్రశాంత్ నీల్ కలయికలో రూపొందుతున్న భారీ పాన్ ఇండియా మూవీ ‘సలార్’. ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజ్ చేశారు కానీ.. టీజర్ మాత్రం రిలీజ్ చేయలేదు. భారీగా క్రేజ్ ఉన్న సినిమాల్లో.. మాస్ ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమాల్లో సలార్ ఒకటని చెప్పచ్చు. ఈ సినిమా టీజర్ ను ఆదిపురుష్ మూవీతో పాటు రిలీజ్ చేయమని అభిమానులు సలహా ఇవ్వడం.. ఆ సలహా కాస్త డిమాండ్ గా మారడం తెలిసిందే. ఇప్పుడు అభిమానుల డిమాండ్ కు తగ్గట్టుగా ఆదిపురుష్ తో పాటు సలార్ టీజర్ రిలీజ్ చేయాలి అనుకుంటున్నారు మేకర్స్.

ఆదిపురుష్ మూవీని జూన్ 16న విడుదల చేయనున్నారు. ఈ మూవీతో పాటు సలార్ టీజర్ వస్తుండడంతో ఎప్పుడెప్పుడు జూన్ 16 వస్తుందా..? ఆదిపురుష్ తో పాటు సలార్ టీజర్ చూద్దామా..? అని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే.. సలార్ టీజర్ ను రెడీ చేశారని ఈ టీజర్ రన్ టైమ్ 90 సెకండ్స్ అని వార్తలు వస్తున్నాయి. ఇంతకు ముందు సలార్ టీజర్ ను రిలీజ్ చేయాలని ఓ టీజర్ రెడీ చేశారు. ఇప్పుడు అదే టీజర్ ను రిలీజ్ చేస్తారా..? లేక కొత్త టీజర్ ని కట్ చేశారా అనేది క్లారిటీ రావాల్సివుంది.

ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న ‘సలార్’ చిత్రాన్ని సెప్టెంబర్ 28న విడుదల చేయనున్నారు. ఈ మూవీ ప్రమోషన్స్ ను ఆదిపురుష్ మూవీతో స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు. ఆదిపురుష్ రిలీజ్ టైమ్ కి సలార్ మూవీ రిలీజ్ మూడు నెలల టైమ్ ఉంటుంది. సలార్ టీజర్ రిలీజ్ తర్వాత నుంచి పక్కా ప్లానింగ్ తో ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ కు ఆ రేంజ్ సక్సెస్ ను ఆదిపురుష్‌ అందిస్తుందో.. సలార్ అందిస్తుందో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్