Saturday, March 14, 2026
Homeసినిమాస‌లార్ టీజ‌ర్ కు ముహుర్తం ఫిక్స్?

స‌లార్ టీజ‌ర్ కు ముహుర్తం ఫిక్స్?

Teaser coming: పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్, కేజీఎఫ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ కాంబినేష‌న్లో రూపొందుతోన్న భారీ, క్రేజీ పాన్ ఇండియా మూవీ ‘స‌లార్‘. ఈ సినిమా ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుంచి భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఇక కేజీఎఫ్ 2 సెన్సేష‌న్ క్రియేట్ చేయ‌డంతో స‌లార్ పై ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న అంచ‌నాలు రెట్టింపు అయ్యాయి. ఇందులో ప్ర‌భాస్ స‌ర‌స‌న శృతిహాస‌న్ న‌టిస్తోంది. ఈ హై వోల్టేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైనర్ షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది.

ఈ మూవీ టీజ‌ర్ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. వాస్తవానికి మే చివరి వారంలోనే టీజర్ రావాల్సి ఉంది. అయితే.. షూటింగ్ ఆలస్యం కావడంలో నిర్ణీత సమయానికి టీజ‌ర్ ను మేక‌ర్స్  రిలీజ్ చేయ‌లేక‌పోయారు. తాజాగా ఈ చిత్రం టీజర్ కు సంబంధించి ఒక లేటెస్ట్ అప్ డేట్ వచ్చింది. అది ఏంటంటే.. జులై రెండో వారంలో టీజర్ విడుదల కాబోతోందని, దీనికి సంబంధించి త్వరలోనే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రానుందని టాక్ వినిపిస్తోంది.

ఇందులో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. వచ్చే ఏడాది స‌మ్మ‌ర్ కి ఈ భారీ పాన్ ఇండియా మూవీని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. మ‌రి.. బాహుబ‌లి హీరో ప్ర‌భాస్, కేజీఎఫ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ కలిసి చేస్తోన్న స‌లార్ ఏ రేంజ్ స‌క్సెస్ సాధిస్తుందో చూడాలి.

Also Read : ఆదిపురుష్‌, స‌లార్ ఇంట్ర‌స్టింగ్ అప్ డేట్స్. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular