Saturday, March 14, 2026
Homeసినిమానెట్ ఫ్లిక్స్ కి వచ్చేసిన 'సలార్' 

నెట్ ఫ్లిక్స్ కి వచ్చేసిన ‘సలార్’ 

ప్రభాస్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందిన ‘సలార్’, డిసెంబర్ 22వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమా రిలీజ్ కి ముందే విపరీతమైన హైప్ తెచ్చుకుంది. ఓపెనింగ్స్ విషయంలో కొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందని అభిమానులు భావించారు. అందుకు తగినట్టుగానే ఈ సినిమా దూసుకుపోయింది. కొన్ని రోజుల వరకూ రోజుకి 100 కోట్లను వసూలు చేస్తూ వెళ్లింది. ప్రభాస్ ను మాస్ యాక్షన్ జోనర్లో చూడాలని కొంతకాలంగా కోరుకుంటున్నవారి ముచ్చటను ఈ సినిమా తీర్చేసింది. అభిమానుల అంచనాలను అందుకోగలిగింది.

అలాంటి ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను ‘నెట్ ఫ్లిక్స్’ వారు దక్కించుకున్నారు. ఇందుకోసం వాళ్లు భారీ మొత్తాన్ని చెల్లించినట్టుగా సమాచారం. ఈ రోజు నుంచి ఈ సినిమా తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. థియేటర్ లో ఈ సినిమాను ఎంజాయ్ చేసిన ప్రేక్షకులు సైతం ఈ సినిమా ఎప్పుడు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. అందువలన ఓటీటీ వైపు నుంచి ఈ సినిమాకి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

స్నేహం కోసం ప్రాణాలిచ్చే పాత్రలో ప్రభాస్ కనిపిస్తాడు. తన కొడుకును దుర్మార్గులకు దూరంగా పెంచాలని హీరో తల్లి ఆశపడుతుంది. అయితే స్నేహం ధర్మం కోసం నిలబడాలని కొడుకు నిర్ణయించుకున్నప్పుడు,  ఆమె తన మనసును మార్చుకోవడమే కథ. ఈ కథలో ప్రతి అంశం భారీస్థాయిలో కనిపిస్తుంది. కథాకథనాల కంటే భారీతనమే ఈ సినిమాకి ప్రధానమైన ఆకర్షణగా నిలిచింది. ‘కేజీఎఫ్’ దర్శక నిర్మాతలే ఈ సినిమాను చేయడం వలన, ఆ ఛాయలు ఎక్కువగా కనిపించాయనే అభిప్రాయాలు థియేటర్ల దగ్గర ఎక్కువగా వినిపించాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular