Sunday, January 19, 2025
HomeసినిమాPrabhas: 'సలార్' టీమ్ కీలక నిర్ణయం?

Prabhas: ‘సలార్’ టీమ్ కీలక నిర్ణయం?

ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ పాన్ ఇండియా మూవీ ‘సలార్’.  శృతిహాసన్ హీరోయిన్ గా  నటిస్తోంది. ఈ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పటి నుంచి ఊర మాస్ అనే ఫీలింగ్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా… కామన్ ఆడియన్స్ కి సైతం కలిగించింది. దీంతో సలార్ ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తుంది అనేది ఆసక్తిగా మారింది. ఇటీవల గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. చాలా తక్కువ టైమ్ లోనే 100 మిలియన్స్ సాధించింది. యూట్యూబ్ ని షేక్ చేసింది.

ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. సెప్టెంబర్ 28న భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. అయితే.. అందరిలో భారీ అంచనాలు కలిగించిన సలార్ గురించి ప్రస్తుతం ఓ వార్త బయటకు వచ్చింది. అది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఏంటంటే.. ఈ నెలాఖరున ట్రైలర్ రిలీజ్ కు ముందు ఈ మూవీకి సంబంధించిన టీమ్ మెంబర్స్ ఎవరూ కూడా మీడియాకి ఇంటర్ వ్యూలు ఇవ్వద్దని నిర్ణయించారట. వార్తపత్రికలకు కూడా ఎలాంటి న్యూస్ ఇవ్వకూడదని చెప్పారట. ఇది సలార్ టీమ్ తీసుకున్న కీలక నిర్ణయం అంటూ ప్రచారం జరుగుతోంది.

బాహుబలి హీరో ప్రభాస్, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలిసి చేస్తున్న సినిమా కావడంతో సలార్ పై ఆకాశమే హద్దు అనేలా అంచనాలు ఉన్నాయి. ఈ నెలాఖరున ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు. అప్పటి నంచి ప్రమోషన్స్ స్టార్ట్ చేయనున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ కు ఆ రేంజ్ సక్సెస్ రాలేదు. దీంతో అభిమానులు ఎప్పుడెప్పుడు సలార్ వస్తుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్