Saturday, January 18, 2025
Homeసినిమా'రాజుకు నచ్చిందే రంభ' అంటున్న సలోని

‘రాజుకు నచ్చిందే రంభ’ అంటున్న సలోని

వి. చిన్న శ్రీశైలం యాదవ్‌ సమర్పణలో దేవరపల్లి ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై వస్తున్నా మొదటి చిత్రం ‘రాజుకు నచ్చిందే రంభ’. రావంత్‌, సలోనీ ప్రధాన పాత్రల్లో నటించనున్న ఈ చిత్రానికి శ్రీనివాసరావు ర్యాలి దర్శకత్వం వహిస్తున్నారు. దేవరపల్లి అఖిల్‌, వల్లాల ప్రవీణ్‌కుమార్‌ యాదవ్‌ నిర్మాతలు. జూలై 4న పూజా కార్యక్రమాలను జరుపుకుని రెగ్యులర్‌ షూటింగ్‌కు రెడీ అవుతోంది.

ర్యాలి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ” రాజుకు నచ్చిందే రంభ’ పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. ఒక హీరోయిన్‌గా సలోనీ నటిస్తోంది. మరో హీరోయిన్‌ని త్వరలోనే ఎంపిక చేస్తాము. చంద్రబోస్‌గారు, రామజోగయ్య శాస్త్రిగారు చాలా మంచి పాటలు ఇచ్చారు. రఘు కుంచెగారు అంతే అద్భుతంగా పాటలను కంపోజ్‌ చేసేందుకు రెడీ అవుతున్నారు. సాంగ్స్‌ రికార్డింగ్‌ త్వరలోనే మొదలవుతుంది. దర్శకుడిగా నాకు అవకాశం ఇచ్చిన నిర్మాతలకు కృతజ్ఞతలు, మిగిలిన వివరాలు త్వరలోనే తెలియజేస్తాం..” అని అన్నారు.

సంగీత దర్శకుడు రఘు కుంచె మాట్లాడుతూ.. ”దేవరపల్లి ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో తొలి సినిమా ‘రాజుకు నచ్చిందే రంభ’ చిత్రానికి పని చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది నాకు ఛాలెంజింగ్‌ ప్రాజెక్ట్‌. నాకు స్టార్‌ రైటర్స్ ని ఇచ్చారు. నా మార్క్‌ మిస్‌ కాకుండా అద్భుతమైన బాణీలను సమకూర్చి, చిత్ర విజయంలో నా వంతు పాత్ర పోషిస్తానని తెలియజేస్తున్నాను..” అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్