Sunday, January 19, 2025
HomeసినిమాWhat To Do : 'సామజవరగమన' ఫస్ట్ సింగిల్ విడుదల

What To Do : ‘సామజవరగమన’ ఫస్ట్ సింగిల్ విడుదల

శ్రీవిష్ణు కథానాయకుడిగా వివాహ భోజనంబు ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందుతున్న  ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘సామజవరగమన’. అనిల్ సుంకర సగర్వంగా సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి హాస్య మూవీస్ బ్యానర్‌ పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో శ్రీవిష్ణుకు జోడిగా రెబా మోనికా జాన్ నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన సినిమా ఫస్ట్ గ్లింప్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్‌ వచ్చింది. సినిమా అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోందని భరోసా ఇచ్చింది.

తాజాగా ఈ చిత్రం ఫస్ట్ సింగిల్ ‘వాట్ టు డూ’ పాటని విడుదల చేసి సామజవరగమన మ్యూజికల్ జర్నీని స్టార్ట్ చేశారు మేకర్స్. గోపీ సుందర్ ఈ పాటని అందరికీ కనెక్ట్ అయ్యే క్యాచీ ఫుట్ ట్యాపింగ్ నెంబర్ గా కంపోజ్ చేశారు. తనలోని ఫ్రస్టేషన్ ని చెబుతూ కథానాయకుడు పాడుకునే ఈ పాటకు శ్రీమణి అందించిన సాహిత్యం మరో ఆకర్షణగా నిలిచింది. జస్సీ గిఫ్ట్ ఈ పాటని ఎనర్జిటిక్ గా ఆలపించారు. ఈ పాటలో శ్రీవిష్ణు చేసిన మాస్ మూమెంట్స్ అలరించాయి. భాను బోగవరపు కథను అందించగా, నందు సవిరిగాన సంభాషణలు రాశారు. ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణుల బృందం ఈ చిత్రానికి పని చేస్తున్నారు. గోపి సుందర్ సంగీతం అందిస్తుండగా, రామ్‌రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్, బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్. మే 18న వేసవి కానుకగా ఈ చిత్రం గ్రాండ్ గా విడుదల కానుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్