Saturday, March 14, 2026
Homeసినిమాసమంత 'యశోద'కు హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్

సమంత ‘యశోద’కు హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్

Samantha with Action:  కమర్షియల్ విలువలతోపాటు కంటెంట్ ఉన్న కథలకు సమంత ఓకే చెప్తున్నారు. శ్రీదేవి మూవీస్ పతాకంపై ఆమె నటిస్తున్న చిత్రమే ‘యశోద’. సమంత ఇంతకు ముందు చేసిన ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలకు విభిన్నం ఇది. ఇందులో యాక్షన్ పార్ట్ కూడా ఉంది. హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ యానిక్ బెన్‌తో యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించారు.

‘ద ఫ్యామిలీ మ్యాన్-2’ వెబ్ సిరీస్‌కు యానిక్ బెన్ వర్క్ చేశారు. అందులో యాక్షన్ సీన్స్‌ కు ఆయన డైరెక్షన్ చేశారు. సమంతతో ‘యశోద’ ఆయనకు సెకండ్ ప్రాజెక్ట్. హాలీవుడ్‌లో క్రిస్టోఫర్ నోలన్ సినిమాలకు స్టంట్ పర్ఫార్మర్‌గా కూడా ఆయన వర్క్ చేశారు. రీసెంట్‌గా హైద‌రాబాద్‌లో పది రోజుల పాటు ‘యశోద’ యాక్షన్ సీక్వెన్స్ తీశారు. ఇంకో యాక్షన్ సీక్వెన్స్ కొడైకెనాల్‌లో జరిగే షెడ్యూల్‌లో తీయాలని ప్లాన్ చేశారు. మూడు కోట్ల రూపాయల భారీ వ్యయంతో ఆర్ట్ డైరెక్టర్ అశోక్ వేసిన సెట్స్‌ లో ప్రస్తుతం షూటింగ్ చేస్తున్నారు.

ఈ సన్నివేశాలపై శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ “సమంత తదితరులపై పదిరోజులపాటు మూడు సెట్స్‌ లో షూటింగ్ చేశాం. సమంత కష్టపడి అద్భుతంగా యాక్షన్ సీన్స్ చేశారు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే థ్రిల్లర్ చిత్రమిది” అని చెప్పారు. వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రాన్ని హరి, హరీష్ క‌లిసి తెర‌కెక్కిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular