Saturday, January 18, 2025
HomeసినిమాSamantha Interview: అతనంటే ఇష్టం.. సినిమా నిర్మిస్తాను - సమంత

Samantha Interview: అతనంటే ఇష్టం.. సినిమా నిర్మిస్తాను – సమంత

ఏమాయ చేశావే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నటి సమంత. తన అందం, అభినయంతో ఆకట్టుకుని అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ అయ్యింది. ఇప్పుడు ఖుషి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇందులో విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించారు. ప్రేమకథా చిత్రాల స్పెషలిస్ట్ శివ నిర్వాణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా పాటలు, టీజర్ అండ్ ట్రైలర్ కు అనూహ్య స్పందన వచ్చింది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ విభిన్న ప్రేమకథా చిత్రాన్ని సెప్టెంబర్ 1న విడుదల చేయనున్నారు.

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్ వ్యూలో సమత పలు ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. ఇంతకీ ఏం చెప్పారంటే.. వెన్నెల కిషోర్ యాక్టింగ్ అంటే చాలా ఇష్టమని.. అందుకనే అతనితో సినిమా నిర్మిస్తానని చెప్పారు. ఇక ‘ఖుషి’ సినిమా గురించి చెబుతూ.. ఇది ఒక మెచ్యూర్డ్ స్టోరీ అని.. అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుందని.. ఖచ్చితంగా ఖుషి సక్సెస్ అవుతుందని చెప్పింది. శివ నిర్వాణ అంటే.. విభిన్న ప్రేమకథలను అందిస్తుంటారు. అందుచేత ఈ సినిమా కూడా విభిన్నంగా ఉంటుందని.. అందరికీ కనెక్ట్ అవుతుందనే టాక్ ఉంది. మరి.. బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తుందో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్