Wednesday, June 26, 2024
Homeసినిమాసమంత పారితోషికమే ఇప్పుడు హాట్ టాపిక్!

సమంత పారితోషికమే ఇప్పుడు హాట్ టాపిక్!

తెలుగు .. తమిళ భాషల్లో ఒకే సమయంలో స్టార్ హీరోయిన్ గా సమంత  తన జోరు చూపిస్తూ వచ్చింది. అక్కడ .. ఇక్కడ కూడా స్టార్ హీరోలతో వరుస సినిమాలు చేస్తూ .. వీలైనన్ని విజయాలను  వెనకేసుకుంటూ వచ్చింది. అలాంటి సమంత జోరు ఈ మధ్య కాస్త తగ్గిందనే చెప్పాలి. ‘యశోద’ తరువాత సమంత హిట్ అనే మాటను వినలేకపోయింది. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ‘శాకుంతలం’ భారీ పరాజయాన్నే చూసింది. ఇటీవల వచ్చిన ‘ఖుషి’ కూడా ఆమె అభిమానులను నిరాశ పరిచింది.

ఈ నేపథ్యంలో సమంత జోరు తగ్గిందనీ .. పారితోషికం విషయంలో ఆమె ఓ మెట్టు తగ్గే అవకాశం ఉందనే టాక్ కూడా నడిచింది. అయితే ఒకటి .. రెండు ఫ్లాపులు పడగానే తన మార్కెట్ పడిపోయే రకం కాదన్నట్టుగా సమంత ఎంతమాత్రం పారితోషికం తగ్గలేదనే ప్రచారం కొనసాగుతోంది. ఇటీవలే ఆమె కోలీవుడ్ స్టార్ విజయ్ సరసన నాయికగా ఒక సినిమా చేయడానికి గాను, ఆ ప్రాజెక్టుపై సంతకం చేసింది. తన కెరియర్ లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న సినిమా ఇదేనని చెప్పుకుంటున్నారు.

ప్రస్తుతం విజయ్ .. వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఆ తరువాత వినోద్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. అందుకు సంబంధించిన సన్నాహాలు జరిగిపోతూనే ఉన్నాయి. ఈ సినిమా కోసం కథానాయికగా సమంతను ఎంపిక చేశారని సమాచారం. అందుకోసం  ఆమె భారీ పారితోషికమే అంటుకుంటోందని అంటున్నారు. విజయ్ జోడీగా గతంలో ఆమె ‘మెర్సిల్’ .. ‘తేరి’ చేసిన సంగతి తెలిసిందే. ఇక లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు సమంత తీసుకునే పారితోషికం కూడా గట్టిగానే ఉండొచ్చుననే అభిప్రాయాలు కూడా బలంగానే వినిపిస్తున్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్