Saturday, January 18, 2025
Homeసినిమా‘ఘోస్ట్’ త‌ర్వాత నాగ్ సినిమా ఎవ‌రితో?

‘ఘోస్ట్’ త‌ర్వాత నాగ్ సినిమా ఎవ‌రితో?

What Next: టాలీవుడ్ కింగ్ నాగార్జున ‘బంగార్రాజు’తో బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించి మ‌ళ్లీ ఫామ్ లోకి వ‌చ్చేశారు. ప్ర‌స్తుతం ఘోస్ట్ అనే భారీ యాక్ష‌న్ మూవీలో నాగ్ నటిస్తున్నారు. దీనికి గ‌రుడ‌వేగ ఫేమ్ ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. స్టైలీష్ యాక్ష‌న్ మూవీగా రూపొందుతోన్న ఈ సినిమాలో నాగార్జున ఇప్ప‌టి వ‌ర‌కు చేయ‌ని యాక్ష‌న్ ని ఈ సినిమాలో చేస్తున్నార‌ని.. ఈ సినిమాతో మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించ‌డం ఖాయ‌మ‌ని టాలీవుడ్ లో టాక్ బ‌లంగా వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే.. ఈ సినిమా త‌ర్వాత నాగార్జున ఎవ‌రితో సినిమా చేయ‌నున్నారంటే… మాస్ డైరెక్ట‌ర్ సంప‌త్ నంది పేరు వినిపిస్తోంది. సంప‌త్ నంది టాలెంటెడ్ డైరెక్ట‌ర్ అయితే.. అత‌నికి అనుకున్నంత స‌క్సెస్ రాలేద‌నే చెప్ప‌చ్చు. అందుక‌నే కెరీర్ లో ట‌ర్నింగ్ పాయింట్ గా నిలిచే సినిమా చేసేందుకు గ‌త కొంత‌కాలంగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. బాల‌య్య‌తో సంప‌త్ నంది సినిమా అని వార్త‌లు వ‌చ్చాయి కానీ.. ఆ ప్రాజెక్ట్ క‌న్ ఫ‌ర్మ్ కాలేద‌ని స‌మాచారం.

ఇటీవ‌ల నాగార్జున కోసం ఓ ప‌వ‌ర్ ఫుల్ మాస్ స్టోరీ రెడీ చేశాడ‌ని.. త్వ‌ర‌లోనే నాగార్జున‌కు క‌థ వినిపించ‌నున్నార‌ని తెలిసింది. నాగార్జున కూడా ఓ ప‌వ‌ర్ ఫుల్ మాస్ సినిమా చేయాలి అనుకుంటున్నారు. ఈ ప్రాజెక్ట్ క‌నుక క‌న్ ఫ‌ర్మ్ అయితే.. నాగార్జున అభిమానుల‌కు పండ‌గే. మ‌రి.. దీనిపై త్వ‌ర‌లోనే క్లారిటీ వ‌స్తుందేమో చూడాలి.

Also Read : ది ఘోస్ట్ కొత్త షెడ్యూల్ ఊటీలో ప్రారంభం

RELATED ARTICLES

Most Popular

న్యూస్