Sunday, January 19, 2025
Homeసినిమాఆగ‌ష్టులో ధియేట‌ర్స్ కలుస్తానంటున్న ‘బ‌జార్ రౌడి’

ఆగ‌ష్టులో ధియేట‌ర్స్ కలుస్తానంటున్న ‘బ‌జార్ రౌడి’

‘హృదయ కాలేయం’, ‘కొబ్బ‌రిమ‌ట్ట’ కామెడి చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల్ని త‌న అభిమానులుగా మార్చుకున్న బ‌ర్నింగ్‌స్టార్ సంపూర్ణేష్ బాబు. కె ఎస్ క్రియేషన్స్ పతాకంపై బోడెంపూడి కిరణ్ కుమార్ సమర్పణలో తెరకెక్కుతున్న సినిమా బజార్ రౌడీ. ఈ సినిమాని సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు డి. వ‌సంత నాగేశ్వ‌రావు తెర‌కెక్కించారు. ఇప్ప‌టికే ట్రేడ్ లో క్రేజ్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రాన్ని సంధిరెడ్డి శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు. శేఖర్ అలవలపాటి నిర్మాణసారధ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం లో సంపూర్ణేష్ బాబు కి జోడిగా మ‌హేశ్వ‌రి వ‌ద్ది న‌టిస్తున్నారు.

ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ తో సంపూ మార్క్ తో ఈ చిత్రం ఆద్యంతం న‌వ్వుల‌తో వుండేలా తెరకెక్కించారు.  సీనియర్ రైటర్ మరుధూరి రాజా ఈ సినిమాకు మాటలు రాశారు. ఎడిటర్ గౌతంరాజు బజార్ రౌడీ చిత్రాన్ని చాలా బాగా కుదించారు.  SS ఫ్యాక్టరీ సంగీతం సమకూర్చిన ఈ సినిమాకు ఏ విజయ్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. ఈ సినిమా ని అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి అగ‌ష్టు లో ప్ర‌పంచ‌ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ ప్లాన్ చేయనున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్