Monday, January 20, 2025
Homeసినిమా‘బ్రిలియంట్ బాబు’ పాటకు యూట్యూబ్‌లో అద్భుత స్పందన

‘బ్రిలియంట్ బాబు’ పాటకు యూట్యూబ్‌లో అద్భుత స్పందన

Brilliant Babu: బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా వెల్డింగ్ శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘బ్రిలియంట్ బాబు’.. సన్నాఫ్ తెనాలి. రాజ్ కుమార్ ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై రాజ్ కుమార్ చందక ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను ఇటీవల దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చేతుల మీదుగా విడుదలైంది. తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన పాటకు అద్భుతమైన స్పందన వస్తుంది. ముఖ్యంగా ఈ పాటలోని విజువల్స్ అన్నీ డిఫెరెంట్ లొకేషన్స్‌ లో షూట్ చేసారు. ఆ లొకేషన్స్ పాటకు అదనపు ఆకర్షణగా నిలిచాయి.

పాటలో సంపూర్ణేష్ బాబు డ్యాన్సులకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా ఈ పాట విడుదలైన క్షణం నుంచి యూ ట్యూబ్‌లో చాలా మంది అప్లాజ్ దక్కించుకుంటుంది. ఈ సినిమాకు శివరాం డైలాగ్స్ అందిస్తుండగా.. డిఎస్సార్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, అంతర స్వర్ణకర్, అదుర్స్ రఘు, శివ శంకర్ మాస్టర్, రాకేట్ రాఘవ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని  పోస్ట్ ప్రొడక్షన్ పనులు శర వేగంగా జరుపుకుంటుంది. త్వరలోనే విడుదల తేదీని తెలియజేస్తామని చిత్ర యూనిట్ తెలిపింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్