Sunday, January 19, 2025
Homeసినిమాప‌వ‌న్ తో మూవీ గురించి క్లారిటీ ఇచ్చిన స‌ముద్ర‌ఖ‌ని

ప‌వ‌న్ తో మూవీ గురించి క్లారిటీ ఇచ్చిన స‌ముద్ర‌ఖ‌ని

Pawan-Khani: ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌కీల్ సాబ్ మూవీతో రీ ఎంట్రీ ఇవ్వ‌డం… బ్లాక్ బ‌స్ట‌ర్ స‌క్సెస్ సాధించ‌డం తెలిసిందే. రీసెంట్ గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన భీమ్లా నాయ‌క్ సినిమాతో కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ స‌క్సెస్ సాధించాడు ప‌వ‌ర్ స్టార్. ఇప్పుడు క్రిష్ డైరెక్ష‌న్ లో హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు అనే భారీ చిత్రం చేస్తున్నారు. చారిత్రాత్మ‌క చిత్రంగా రూపొందుతోన్న ఈ సినిమాని సీనియ‌ర్ ప్రొడ్యూస‌ర్ ఏఎం ర‌త్నం నిర్మిస్తున్నారు. ఇది ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ‌స్ట్ పాన్ ఇండియా మూవీ కావ‌డం విశేషం.

అయితే.. స‌ముద్ర‌ఖ‌ని ద‌ర్శ‌క‌త్వంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించ‌నున్నార‌ని.. ఈ చిత్రాన్ని త్వ‌ర‌లో ప్ర‌క‌టిస్తార‌ని వార్త‌లు వ‌చ్చాయి కానీ.. ఎలాంటి అప్ డేట్ బ‌య‌ట‌కు రాలేదు. ఇదిలా ఉంటే.. ఇటీవ‌ల ఓ ఛాన‌ల్ కి ఇచ్చిన ఇంట‌ర్ వ్యూలో స‌ముద్ర‌ఖ‌ని మాట్లాడుతూ.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో సినిమా చేయ‌నున్న‌ట్టుగా ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతోంది. త్వ‌ర‌లోనే అనౌన్స్ మెంట్  ఉంటుంద‌ని తెలియ‌చేశారు.

త‌మిళంలో విజ‌యం సాధించిన వినోదాయ సీతాంను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. స‌ముద్ర‌ఖ‌ని తెర‌కెక్కించ‌నున్న ఈ సినిమాలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో పాటు మెగాస్టార్ మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్ కూడా న‌టింనున్న‌ట్టుగా వార్త‌లు వ‌స్తున్నాయి కానీ.. అధికారికంగా ప్ర‌క‌టించ‌లేదు. ఈ సినిమాను ఓ అభిమానిగా తెర‌కెక్కిస్తాన‌ని స‌ముద్ర‌ఖ‌ని ప్ర‌క‌టించారు. ప‌వ‌న్, తేజు క‌లిసి న‌టిస్తే.. అభిమానుల‌కు పండ‌గే.

Also Read : వీర‌మ‌ల్లు..అనుకున్న సమయానికి వచ్చేనా? 

RELATED ARTICLES

Most Popular

న్యూస్