Sunday, January 19, 2025
HomeసినిమాSamyukta Menon: గ్లామర్ తో పాటు లౌక్యం కూడా ఉన్నట్టే!

Samyukta Menon: గ్లామర్ తో పాటు లౌక్యం కూడా ఉన్నట్టే!

తెలుగు తెరపై అందాల సందడి చేస్తున్న కథానాయికలలో కేరళ బ్యూటీలే ఎక్కువ. అక్కడి నుంచి వచ్చిన వారిలో ఇక్కడ చాలామంది చక్రం తిప్పారు .. తిప్పుతున్నారు. స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతున్నారు. ఇప్పుడు అదే మార్గంలో సంయుక్త మీనన్ కూడా ముందుకు వెళుతోంది. 2016లోనే ఈ సుందరి మలయాళ సినిమాతో వెండితెరకి పరిచయమైంది. అక్కడ బాగానే వరుస అవకాశాలను అందుకుంటూ క్రేజ్ ను సంపాదించుకుంది.

ఆ తరువాత కోలీవుడ్ పై కన్నేసిన ఈ భామ అక్కడ కుదురుకునే ప్రయత్నాలు చేస్తూనే, ‘భీమ్లా నాయక్’ సినిమాతో తెలుగు తెరకి పరిచయమైంది. ముందుగా ఒప్పుకున్నది ‘బింబిసార’ అయినప్పటికీ, ప్రేక్షకుల ముందుకు వచ్చింది మాత్రం ‘భీమ్లా నాయక్’. అయితే ఈ రెండు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ ను నమోదు చేశాయి. నిజం చెప్పాలంటే ఈ సినిమాల్లో ఆమె పాత్రకి పెద్దగా ప్రాధాన్యత లేదు. అయినా ధనుశ్ వంటి స్టార్ హీరో జోడీగా ద్విభాషా చిత్రమైన ‘సార్’లో ఛాన్స్ కొట్టగలిగింది.

ఈ రెండు భాషల్లోను ‘సార్’ (వాతి) భారీ విజయాన్ని అందుకుంది. విషయమేమిటంటే ఈ సినిమాలోను ఆమె పాత్రకి ఉన్న ప్రాధాన్యత అంతంత మాత్రమే. అయినా ఆమె వరుస అవకాశాలను అందుకుంటుందంటే గ్లామర్ తో పాటు కాస్త లౌక్యం కూడా తెలిసి ఉండటమేనని అంటున్నారు. అందువల్లనే ఆమె ‘విరూపాక్ష’లోను అవకాశాన్ని అందుకోగలిగిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 21వ తేదీన ఈ సినిమా థియేటర్లకు రానుంది. ఈ సినిమాలో సాయితేజ్ జోడీగా ఆమె అలరించనుంది. ఇందులో అయినా బలమైన పాత్ర చేసిందా లేదా అనేది చూడాలి మరి.

Also Read : సంయుక్త మీనన్ కాస్త కేర్ తీసుకోవలసిందే!

RELATED ARTICLES

Most Popular

న్యూస్