Saturday, March 14, 2026
HomeసినిమాSamyuktha Menon: ఐకాన్ స్టార్ కు జంటగా సంయుక్త మీనన్..?

Samyuktha Menon: ఐకాన్ స్టార్ కు జంటగా సంయుక్త మీనన్..?

అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప 2’ మూవీ చేస్తున్నారు. ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. పుష్ప సినిమా సంచలన విజయం సాధించడంతో పుష్ప 2 పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే నెక్ట్స్ చేయబోయే సినిమాలను ఫైనల్ చేసే పనిలో ఉన్నారు బన్నీ. త్రివిక్రమ్ శ్రీనివాస్, సురేందర్ రెడ్డిలతో సినిమాలు చేసేందుకు ఓకే చెప్పారని వార్తలు వచ్చాయి. ఆతర్వాత బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీతో  కూడా మూవీ కన్ ఫర్మ్ అయ్యింది అంటూ ప్రచారం మొదలైంది.

ఇదిలా ఉంటే.. ఇప్పుడు బన్నీ పుష్ప 2 తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మూవీ చేయనున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా సంయుక్త మీనన్ ను తీసుకున్నారని టాక్ వినిపిస్తుంది. సంయుక్త మీనన్ ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. భీమ్లా నాయక్ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు తొలి ప్రయత్నంలోనే బిగ్ సక్సెస్ సాధించింది. ఆతర్వాత బింబిసార మూవీతో మరో బ్లాక్ బస్టర్ సాధించింది. ఆతర్వాత సార్ అంటూ మరో బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకుంది. రీసెంట్ గా మెగా హీరో సాయిధరమ్ తేజ్ కు జంటగా నటించిన విరూపాక్ష సినిమాతో మరో విజయాన్ని అందుకుంది.

ఇలా.. వరుసగా నాలుగు బ్లాక్ బస్టర్స్ సాధించి ఇండస్ట్రీలో గోల్డన్ లెగ్ అనే ట్యాగ్ దక్కించుకుంది. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ ఐకాన్ స్టార్ సరసన నటించే లక్కీ ఛాన్స్ దక్కించుకుందనేది టాలీవుడ్ టాక్. ఇప్పటికే ఈ సంయుక్తను చిత్రయూనిట్ సంప్రదించగా.. ఓకే చేసినట్లు సమాచారం. ఈ మలయాళ ముద్దుగుమ్మకు వరుసగా ఆఫర్స్ వస్తుండడంతో ఫుల్ ఖుషీగా.. ఫుల్ బిజీగా ఉందట. మలయాళ, తమిళ చిత్రాల్లో నటించినప్పటికీ అంతగా గుర్తింపు రాలేదు.. అవకాశాలు రాలేదు కానీ.. తెలుగు సినిమాల్లో నటించినప్పటి నుంచి బాగా కలిసొచ్చింది. బన్నీతో మూవీ చేస్తే.. మరింత క్రేజ్ రావడం ఖాయం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular