Thursday, March 19, 2026
Homeసినిమాఅద్భుతమైన లొకేషన్స్ లో ‘రాధే శ్యామ్’  సాంగ్

అద్భుతమైన లొకేషన్స్ లో ‘రాధే శ్యామ్’  సాంగ్

Sanchari song:
ప్రభాస్ హీరోగా నటించిన పాన్ ఇండియా మూవీ ‘రాధే శ్యామ్’. ఈ చిత్రానికి జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమా కోసం చిత్ర దర్శక నిర్మాతలు చాలా కష్టపడుతున్నారు. అభిమానులకు సరికొత్త మ్యూజిక్ ఫీల్ ఇవ్వాలి అని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇండియాలో మరే సినిమాకు సాధ్యం కాని స్థాయిలో ఓకే సినిమా కోసం రెండు డిఫరెంట్ మ్యూజిక్ టీమ్స్ వర్క్ చేస్తున్నాయి. ఇటు సౌత్ అటు నార్త్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా అత్యున్నత సంగీత దర్శకులతో పాటలు సిద్ధం చేయిస్తున్నారు రాధే శ్యామ్ టీం.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన అన్ని పాటలకు మంచి అప్లాజ్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి ‘సంచారి’ సాంగ్ విడుదలయింది. జస్టిన్ ప్రభాకరన్ అద్భుతమైన సంగీతం అందించారు. ప్రేమను వెతుక్కుంటూ హీరో చేసే ప్రయాణమే ఈ పాట. ఇందులో అత్యద్భుతమైన విజువల్స్ కనిపిస్తున్నాయి. ప్రభాస్ చాలా అందంగా ఉన్నారు. జస్టిన్ ప్రభాకరన్, అర్జిత్ సింగ్, మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్, జబిన్ నౌతీయల్, మనోజ్ ముంటాషిర్, కుమార్, రష్మీ విరాగ్ బృందం అంతా కలిసి సౌత్ నార్త్ వర్షన్స్ కు రాధే శ్యామ్ సినిమాకు అద్భుతమైన క్లాసిక్ సంగీతం అందిస్తున్నారు.

మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ.. కమల్ కన్నన్ విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయి. కోటగిరి వెంకటేశ్వరరావు దీనికి ఎడిటింగ్ వర్క్ చేశారు. యువి క్రియేష‌న్స్ ప్రొడక్షన్స్ వాల్యూస్ చాలా ఉన్నతంగా ఉన్నాయి. సౌండ్ ఇంజ‌నీర్ ర‌సూల్ పూకుట్టి వ‌ర్క్‌ అద‌న‌పు ఆకర్ష‌ణగా నిలిచింది. సంక్రాంతి కానుక‌గా ఈ భారీ పిరియాడిక్ మూవీని జనవరి 14, 2022న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుదల చేయ‌నున్నారు.

Also Read : ‘నగుమోము తారలే..’ సాంగ్ కు ట్రెమండ‌స్ రెస్పాన్స్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular