Thursday, March 19, 2026
Homeసినిమాసందీప్ కిషన్ కొత్త సినిమా ప్రారంభం

సందీప్ కిషన్ కొత్త సినిమా ప్రారంభం

యంగ్ హీరో సందీప్ కిషన్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. వినూత్న కాన్సెప్టులతో చిత్రాలను తెరకెక్కించే దర్శకుడు వీఐ ఆనంద్‌తో క‌లిసి సందీప్ కిషన్ మ‌రో ప్రాజెక్ట్ చేయబోతోన్నారు. స్టార్ ప్రొడ్యూసర్ అనిల్ సుంకర ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. హాస్య మూవీస్ బ్యానర్‌ పై ప్రొడక్షన్ నెంబర్.1 గా రాజేష్ దండా నిర్మిస్తున్న ఈ చిత్రం నేడు పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైంది. ముహూర్త‌పు స‌న్నివేశానికి అల్లరి నరేష్ క్లాప్ కొట్టారు. నాగ శౌర్య కెమెరా స్విచ్చాన్ చేశారు. జెమినీ కిరణ్, నిర్మాత సుధీర్ స్క్రిప్టును దర్శక నిర్మాతలకు అందించారు.

‘నాంది’ మూవీ డైరెక్టర్ విజయ్ కనకమేడల ఫస్ట్ షాట్‌కు దర్శకత్వం వహించారు. కన్నడ సూపర్ హిట్ మూవీ ‘దియా’ ఫేమ్ ఖుషీ రవి, ‘ఏక్ మినీ కథ’ ఫేమ్ కావ్యా థాపర్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. శేఖర్ చంద్ర సంగీతాన్ని అందిస్తున్నారు. కెమెరామెన్‌గా సిద్, ఎడిటర్‌గా చోటా కే ప్రసాద్ బాధ్యతలు నిర్వహించనున్నారు. బాలాజీ గుత్తా సహ నిర్మాత‌. భాను భోగవరపు, నందు సావిరిగన ఈ మూవీకి మాటలు అందిస్తున్నారు. విభిన్న కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ నుంచి ప్రారంభం కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular