Tuesday, September 24, 2024
Homeసినిమాఆది సినిమా గ్లాన్స్ రిలీజ్ చేసిన సందీప్ కిషన్

ఆది సినిమా గ్లాన్స్ రిలీజ్ చేసిన సందీప్ కిషన్

Aadi in 3 Shades: విలక్షణ కథలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో ఆది సాయికుమార్‌ కొత్త సినిమా ‘తీస్ మార్ ఖాన్‘. విజ‌న్ సినిమాస్ బ్యాన‌ర్ పై నాగం తిరుప‌తిరెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘నాటకం’ ఫేమ్ కళ్యాణ్ జి గోగణ దర్శకత్వం వహిస్తున్నారు. RX-100 సినిమాతో యువతను ఆకట్టుకున్న పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా నటిస్తోంది. సునీల్ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు.

హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఉంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ పై ఫోకస్ పెట్టారు దర్శకనిర్మాతలు. ఇందులో భాగంగా ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.

తాజాగా ఈ రోజు ప్రముఖ హీరో సందీప్ కిషన్ సోషల్ మీడియా వేదికగా ‘తీస్ మార్ ఖాన్’ గ్లాన్స్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా చిత్ర సక్సెస్ కోరుకుంటూ చిత్ర యూనిట్ మొత్తానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు సందీప్ కిషన్. ఇక ఈ వీడియోలో ఆది సాయికుమార్ పవర్ ప్యాక్డ్ లుక్‌లో కనిపించారు. సాయి కార్తీక్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. స్టూడెంట్‌గా, రౌడీగా, పోలీస్ ఆఫీసర్‌గా ఆది సాయికుమార్ త్రీ షేడ్స్‌ లో అదరగొట్టనున్నారని తెలుస్తోంది. ఈ గ్లాన్స్ వీడియో ద్వారా సినిమాలో హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ ఉంటాయని స్పష్టమవుతోంది. ఈ సినిమాలో ఆది సాయికుమార్ సరికొత్త లుక్‌లో కనిపించనున్నారు. చిత్రం లోని యాక్షన్ సీన్స్ అందరినీ ఆకట్టుకునే విధంగా ఉండబోతున్నాయి. చిత్రానికి బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ, మణికాంత్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అతి త్వరలో ఈ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు.

Also Read : షూటింగ్ తుది దశలో ఆది ‘తీస్ మార్ ఖాన్’.

RELATED ARTICLES

Most Popular

న్యూస్