అశోక్ తేజ దర్శకత్వంలో ఓ సరికొత్త యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కుతోంది. కేథరిన్ ట్రెసా హీరోయిన్‌గా, సందీప్ మాధవ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని కేసీఆర్ ఫిలిమ్స్, శ్రీమహా విష్ణు మూవీస్ బ్యానర్‌ల పై దావులూరి జగదీష్, పల్లి కేశవరావులు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా జరుపుకుంటోంది.
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ… హీరో, హీరోయిన్‌లతో పాటు చిత్రంలోని ముఖ్యతారాగణం పై ప్రత్యేక వేసిన పోలీస్‌స్టేషన్ సెట్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది. దీంతో పాటు త్వరలో భారీ ఖర్చుతో, ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా మరో షెడ్యూల్‌ను ప్లాన్ చేస్తున్నాం. స్క్రీన్‌ప్లే బేస్‌డ్ సినిమా ఇది. సరికొత్త యాక్షన్ థ్రిల్లర్‌గా చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చే చిత్రమిది అన్నారు.
దర్శకుడు అశోక్ తేజ మాట్లాడుతూ.. ప్రతి సన్నివేశం ఎంతో ఆసక్తికరంగా వుంటుంది. సినిమాలో వుండే ట్విస్ట్‌లు ఎవరూ ఊహించలేరు. పవర్‌ఫుల్ పోలీస్‌ఆఫీసర్‌గా సందీప్ మాధవ్ పాత్ర ఎంతో ఫెరోషియస్‌గా వుంటుంది. హీరోయిన్ కేథరిన్ పాత్రను కూడా దర్శకుడు ఎవరూ ఎక్స్‌పెక్ట్ చేయని రీతిలో డిజైన్ చేశాం. సినిమాకు మంచి టీమ్ కుదరింది అన్నారు.