Tuesday, March 10, 2026
HomeసినిమాSanjay Dutt: ప్రభాస్ మూవీలో సంజయ్ దత్?

Sanjay Dutt: ప్రభాస్ మూవీలో సంజయ్ దత్?

ప్రభాస్, మారుతి డైరెక్షన్ లో ఓ కామెడీ హర్రర్ మూవీ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తుంది. గత కొంతకాలంగా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న ప్రభాస్ ఎంటర్ టైనర్స్ చేసి చాన్నాళ్లు అయ్యింది. అందుకనే రూటు మార్చి తన ఫ్యాన్స్ ని ఎంటర్ టైన్ చేయడం కోసం మారుతితో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా మాత్రం చాలా ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటుంది. ఇంకా చెప్పాలంటే… ప్రభాస్ మారుతితో సినిమా చేయడాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నాడట.

ఈ సినిమా ఫాస్ట్ గా షూటింగ్ జరుగుతుంది కానీ.. ఎలాంటి అప్ డేట్ ను ఇవ్వడం లేదు. కారణం ఏంటంటే…. ‘ప్రాజెక్ట్ కే’ రిలీజ్ వరకు మారుతి సినిమాకి సంబంధించి ఎలాంటి సమాచారాన్ని బయటకు రాకూడదని నిర్ణయం తీసుకున్నారట. అందుకనే ఇప్పటి వరకు మేకర్స్ ఎలాంటి అప్ డేట్ ఇవ్వడం లేదు. అయితే… ఈ సినిమాలో సంజయ్ దత్ నటిస్తున్నారని తెలిసింది. ఓ కీల‌క పాత్ర పోషిస్తున్నారని..  ప్ర‌భాస్‌కి తాత‌య్య‌గా సంజ‌య్ ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడని తెలిసినప్పటి నుంచి ఈ సినిమా పై మరింత ఆసక్తి ఏర్పడింది.

తెలుగులో నాగార్జున నటించిన ‘చంద్ర‌లేఖ‌’ చిత్రంలో గెస్ట్ రోల్ చేశాడు. ఆతర్వాత ఇటు వైపే చూడ‌లేదు. మారుతి సినిమాతో మ‌ళ్లీ సంజ‌య్‌ద‌త్ ని తెలుగులో చూసే అవ‌కాశం ద‌క్కింది. ఈ సినిమాలో సంజూది ప్రామినెంట్ రోల్ అని తెలుస్తోంది. క‌థంతా ఆయ‌న చుట్టూనే తిరుగుతుంద‌ట‌. ప్రభాస్, సంజయ్ దత్ పై సన్నివేశాలను జూన్ లో పూర్తి చేస్తారని టాక్ వినిపిస్తుంది. కొన్ని టైటిల్స్ అనుకుని అందులో ఓ టైటిల్ ని ఫిక్స్ చేశారట. మంచి ముహుర్తం చూసి రిలీజ్ చేస్తారని తెలిసింది. మొత్తానికి తక్కువ బడ్జెట్ లో చేయాలని స్టార్ట్ చేసిన సినిమా ఆఖరికి బిగ్ బడ్జెట్ మూవీ అవుతుండడం విశేషం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular