Saturday, January 18, 2025
Homeసినిమాప్ర‌భాస్ మూవీలో సంజ‌య్ ద‌త్. ఇది నిజ‌మా..?

ప్ర‌భాస్ మూవీలో సంజ‌య్ ద‌త్. ఇది నిజ‌మా..?

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ వ‌రుస‌ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న‌ప్ప‌టికీ.. మారుతితో ఓ సినిమా చేసేందుకు ఓకే చెప్పారు. ప్ర‌స్తుతం ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతుంది. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ సినిమాను నిర్మిస్తోంది. త్వ‌ర‌లోనే సెట్స్ పైకి తీసుకువ‌చ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ మూవీలో ఓ కీల‌క‌ పాత్రకు బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ను తీసుకునే ఆలోచనలో ఉన్నారు. సంజయ్ దత్ ఉంటే పాన్ ఇండియా లుక్ వస్తుందని భావిస్తున్నారు. ఇప్పటికే తమిళ హీరోయిన్ ను ఫైనల్ చేసారని స‌మాచారం. ఇప్పుడు హిందీ స్టార్ ను ప్లాన్ చేస్తున్నారు. మారుతి సినిమాలో కనిపించే రొటీన్ బ్యాచ్ అంటూ ఒకటి వుంటుంది. మారుతి ఏ సినిమా చేసినా వీళ్లు ఉంటారు కానీ ఈసారి మాత్రం మారుతి వీళ్లందరినీ పక్కన పెడుతున్నట్లు తెలుస్తోంది.

మారుతి పూర్తిగా తన సినిమాకు కొత్త లుక్ ఇవ్వాలని, గ్రాండ్ లుక్ వుండాలని అనుకుంటున్నారు. అందుకే స్టార్ కాస్ట్ విషయంలో చాలా జాగ్రత్తగా వుంటున్నారు. సంజయ్ దత్ ను తీసుకోవడంతో పాటు మలయాళ, కన్నడ రంగాలకు చెందిన నటులు కొందరి పేర్లు కూడా పరిశీలిస్తున్నారు. మొత్తానికి ఈ సినిమాను తెలుగులోనే తీయాల‌నుకున్న‌ప్ప‌టికీ.. ఇప్పుడు పాన్ ఇండియా మూవీగా ప్లాన్ చేస్తుండ‌డం విశేషం.

Also Read : రెండు పార్టులుగా ‘స‌లార్’ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్