Sunday, January 19, 2025
Homeసినిమా'డబుల్ ఇస్మార్ట్' కోసం సంజయ్ కు భారీ రెమ్యూనరేషన్..?

‘డబుల్ ఇస్మార్ట్’ కోసం సంజయ్ కు భారీ రెమ్యూనరేషన్..?

రామ్, పూరి కాంబోలో రూపొందుతోన్న భారీ పాన్ ఇండియా మూవీ ‘డబుల్ ఇస్మార్ట్’. ఈ చిత్రాన్ని పూరి, ఛార్మి కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. లైగర్ డిజాస్టర్ తర్వాత పూరి దాదాపు సంవత్సరం పాటు స్ర్కిప్ట్ పై వర్క్ చేశారు. ఈ కథ బాగా నచ్చడంతో వెంటనే రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇటీవల పూజా కార్యక్రమాలతో ప్రారంభించిన ఈ చిత్రాన్ని రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయడం.. ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేయడం కూడా చాలా ఫాస్ట్ గా జరిగిపోయింది. అయితే.. ఈ చిత్రంలో విలన్ గా బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్ ను తీసుకోవడం ఆసక్తిగా మారింది.

ఈ సినిమా కోసం సంజయ్ దత్ కు ఏకంగా 15 కోట్లు రెమ్యూనరేషన్ ఇచ్చారట. అయితే.. ఇది 60 రోజుల డే్ట్స్ కు గాను ఈ మొత్తం ఇచ్చారట. సంజయ్ దత్ ఇందులో నటిస్తున్నారని తెలిసినప్పటి నుంచి పాత్ర నిడివి తక్కువే ఉంటుంది అనుకున్నారు కానీ.. 60 రోజుల డేట్స్ ఇవ్వడాన్ని బట్టి ఎంత పెద్ద క్యారెక్టర్ అనేది తెలుస్తుంది. ఫస్ట్ షెడ్యూల్ లో సంజయ్ దత్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరించారని సమాచారం. సంజయ్ దత్ కేజీఎఫ్ లో నటించడం.. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో డిమాండ్ పెరిగింది. ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ లో నటించడంతో ఈ ప్రాజెక్ట్ పై భారీగా క్రేజ్ ఏర్పడింది. ఈ చిత్రాన్ని మార్చి 8న విడుదల చేయనున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్