Thursday, March 12, 2026
Homeసినిమా'మంచి రోజులు వచ్చాయి' ఫస్ట్ లుక్ రిలీజ్

‘మంచి రోజులు వచ్చాయి’ ఫస్ట్ లుక్ రిలీజ్

‘ఏక్ మినీ కథ’ తో సక్సస్ సాధించిన యువ హీరో సంతోష్ శోభన్ ప్రస్తుతం ‘ప్రేమ్ కుమార్’, ‘అన్నీ మంచి శకునములే’ చిత్రాలను ప్రకటించారు. ఈ సినిమాలతో పాటు మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. దీనికి ‘మంచి రోజులు వచ్చాయి’ అని టైటిల్ ఖరారు చేశారు. ఇందులో సంతోష్ శోభన్ సరసన మెహ్రీన్ నటిస్తుంది. యధార్థ సంఘటనలు ఆధారంగా ఈ సినిమా రూపొందిస్తున్నట్టు తెలియచేశారు. ఈ విబిన్న కథా చిత్రాన్ని యువీ కాన్సెప్ట్స్ – మాస్ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో సంతోష్ శోభన్ ఓ గోడకు అనుకోని స్టైల్ గా నిలబడి ఉండగా.. మెహ్రీన్ అతని కళ్ళలోకి చూస్తూ నవ్వుతూ కనిపిస్తోంది. ఈ పోస్టర్ నిజంగానే ఫ్రెష్ గా కనిపిస్తుంది. అన్నింటి కంటే ముఖ్యంగా సంతోష్ శోభన్ చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం సమకూరుస్తుండగా.. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలియచేయనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular