Thursday, March 12, 2026
Homeసినిమాడిసెంబర్ 25న సప్తగిరి ‘గూడుపుఠాణి’

డిసెంబర్ 25న సప్తగిరి ‘గూడుపుఠాణి’

Saptagiri ‘Guduputani’:
ఎస్ఆర్ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో సప్తగిరి, నేహా సోలంకి జంటగా న‌టించిన చిత్రం ‘గూడుపుఠాణి’. ఈ చిత్రాన్ని కె.యమ్.కుమార్ దర్శకత్వంలో రియల్ ఎస్టేట్ కింగ్స్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, కటారి రమేష్ సంయుక్తంగా నిర్మించారు. డిసెంబర్ 25న గ్రాండ్ గా ఈ సినిమా థియేటర్స్ లో విడుదల కాబోతోంది. సప్తగిరి తనదైన శైలి నటనతో మెప్పించడానికి వస్తున్నాడు. సప్తగిరి ఎక్స్ ప్రెస్, సపగిరి ఎల్ఎల్బీ సినిమాల తర్వాత సప్తగిరి హీరోగా వస్తోన్న మూడో చిత్రం ఇది.

సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను చాలా గ్రిప్పింగ్ గా తెరకెక్కించారు దర్శకుడు కె.ఎమ్ కుమార్. రఘు కుంచె మరోసారి తన విలనిజంతో మెప్పించబోతున్నాడు. గూడుపుఠాణి చిత్రం కొన్ని ఏరియాల్లో బ్రహ్మాండమైన బిజినెస్ అవ్వడంతో చిత్ర నిర్మాతలు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, కటారి రమేష్ సంతోషం వ్యక్తం చేశారు. సప్తగిరి, నేహా సోలంకి, రఘు కుంచె తదితరులు న‌టించిన ఈ చిత్రానికి కెమెరామెన్: పవన్ చెన్న, ఎడిటర్: బొంతల నాగేశ్వర్ రెడ్డి, మ్యూజిక్: ప్రతాప్ విద్య, ఫైట్స్: సోలిన్ మల్లేష్, నిర్మాతలు: పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, కటారి రమేష్, డైరెక్షన్: కుమార్.కె.ఎం

Also Read : ‘గూడుపుఠాణి’ ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది : మారుతి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular