Saturday, March 14, 2026
Homeసినిమామరోసారి 'సరిలేరు...' కాంబినేషన్?

మరోసారి ‘సరిలేరు…’ కాంబినేషన్?

2nd one: సూప‌ర్ స్టార్ మహేష్‌ బాబు, స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లో సరిలేరు నీకెవ్వరు సినిమా రూపొంద‌డం.. ఆ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ అవ్వ‌డ తెలిసిందే. ఈ చిత్రం బాక్సాఫీసు దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఆ వెంటనే మహేష్‌, అనిల్ రావిపూడి క‌లిసి మరో సినిమా చేస్తారని టాక్ వ‌చ్చింది. అయితే.. మ‌హేష్ బాబు, అనిల్ రావిపూడి వేరే సినిమాలతో బిజీ అవ్వ‌డం వ‌ల‌న ఈ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి అప్ డేట్ రాలేదు.

ఇప్పుడు ఈ కాంబినేష‌న్ కు సంబంధించిన ఓ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. మేట‌ర్ ఏంటంటే.. వీరిద్దరి కలయికలో ఓ సినిమా రాబోతోందన్నది లేటెస్ట్‌ న్యూస్‌. మహేష్‌ కోసం అనిల్‌ రావిపూడి ఓ కథ సిద్ధం చేశాడట. మహేష్‌ కూడా అనిల్‌తో మరోసారి పని చేయాలని ఉత్సాహం చూపిస్తున్నట్టు తెలుస్తోంది. మహే్‌షతో నా సినిమా ఎప్పుడైనా ఉండొచ్చు. ఆయన పిలిస్తే చాలు. కథ రాసేసి, చక చక పట్టాలెక్కించేయడానికి నేను సిద్ధమే అని అనిల్ చెప్పారు.

ప్ర‌స్తుతం మహేష్ బాబు న‌టించిన‌ సర్కారు వారి పాట విడుదలకు సిద్దంగా ఉంది. మే 12న ఈ సినిమా విడుద‌ల కానుంది.  ఆత‌ర్వాత మ‌హేష్ బాబు త్రివిక్ర‌మ్ తో సినిమా చేయ‌నున్నారు. ఈ మూవీ త‌ర్వాత‌ రాజమౌళితో సినిమా చేస్తారు. ఈ రెండు చిత్రాల తరవాతే.. అనిల్‌ రావిపూడి ప్రాజెక్టు ఉండొచ్చు అని బ‌లంగా టాక్ వినిపిస్తోంది.

Also Read : తమిళంలో కూడా స‌ర్కారు వారి పాట‌ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular