Sunday, January 19, 2025
Homeసినిమాసరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన ‘సర్కారు వారి పాట’ టీజర్

సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన ‘సర్కారు వారి పాట’ టీజర్

సూపర్‌స్టార్ మ‌హేష్ బాబు లేటెస్ట్ మూవీ ‘సర్కారువారి పాట’. ప‌రశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం ప్రారంభం నుంచి భారీ అంచ‌నాల‌ను క్రియేట్ చేసింది. ఆగ‌స్ట్ 9న సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌ బాబు పుట్టిన‌రోజు సందర్భంగా ‘సర్కారు వారి పాట’ బ్లాస్ట‌ర్ విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. ప్రేక్ష‌కాభిమానుల‌ను ఆక‌ట్టుకున్న ఈ బ్లాస్ట‌ర్‌తో సినిమా పై ఇప్ప‌టికే ఉన్న అంచ‌నాలు ఆకాశాన్నంటాయి. విడుద‌లైన 24 గంటల్లోనే టాలీవుడ్‌లో ఎక్కువ‌గా వ్యూస్ ద‌క్కించుకున్న టీజ‌ర్‌గా ఓ సరికొత్త రికార్డ్‌ను క్రియేట్ చేసింది. బ్లాస్ట‌ర్ 24 గంట‌ల్లో.. 25.7 మిలియ‌న్స్ వ్యూస్‌, 7 ల‌క్ష‌ల 54 వేల లైకులను సాధించింది.

మ‌హేష్ స్టైలిష్ లుక్‌, ఎన‌ర్జిటిక్ పెర్ఫామెన్స్‌, త‌న‌దైన ట్రేడ్ మార్క్ డైలాగ్ డెలివ‌రీతో పాటు సినిమాటోగ్ర‌ఫ‌ర్ మ‌ది కెమెరా వ‌ర్క్‌, యాక్ష‌న్ సీన్స్‌, బ్యూటీఫుల్ కీర్తిసురేష్‌, నిర్మాణ విలువ‌లతో బ్లాస్ట‌ర్ ప్రేక్ష‌కాభిమానుల‌కు రియ‌ల్ ఫీస్ట్‌గా మారింది. సినిమా వ‌చ్చే ఏడాది సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 13న విడుద‌ల కాబోతున్న‌ట్లు బ్లాస్ట‌ర్‌లో క‌న్‌ఫ‌ర్మ్ అయ్యింది.

‘స‌ర్కారువారి పాట‌’ ను ప‌ర్‌ఫెక్ట్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా మైత్రీ మూవీ మేక‌ర్స్, జీఎంబీ ఎంట‌ర్‌టైన్మెంట్‌, 14 రీల్స్ ప్ల‌స్ బ్యాన‌ర్స్‌ పై న‌వీన్ ఎర్నేని, వై.ర‌వి శంక‌ర్‌, రామ్ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఆర్‌.మ‌ది సినిమాటోగ్రాఫ‌ర్‌, ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ సంగీతం, మార్తాండ్ కె.వెంక‌టేశ్ ఎడిట‌ర్‌, ఎ.ఎస్‌.ప్ర‌కాశ్ ఆర్ట్ డైరెక్ట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్