Wednesday, March 11, 2026
Homeసినిమాజూలై 31న ‘సర్కారువారి పాట’ ఫస్ట్‌ నోటీస్‌

జూలై 31న ‘సర్కారువారి పాట’ ఫస్ట్‌ నోటీస్‌

సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు త‌న `స‌ర్కారు వారి పాట‌` చిత్రంతో 2022 సంక్రాంతి బాక్సాఫీసు బరిలో నిలుస్తున్నట్లు అధికారికంగా వెల్లడించిన ఫ‌స్ట్ హీరో. ఈ చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీమేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్‌ ఫ్లస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్‌ పై ఇటు ఇండస్ట్రీలో, అటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ‘సర్కారువారి పాట’ టైటిల్, మహేష్‌ బాబు ప్రీ లుక్‌ అందరినీ ఆకట్టుకున్నాయి.

ఈ సినిమా ఫస్ట్‌ నోటీస్‌ను చిత్ర యూనిట్ ఈ నెల 31న విడుదల చేస్తోంది. ఈ సంద‌ర్భంగా విడుద‌ల చేసిన పోస్ట‌ర్లో మహేష్‌ బాబు చేతిలో బ్యాగ్‌ పట్టుకుని ఉన్నారు. అదే విధంగా బైక్‌లు, కార్లులతో పాటు కొంత మంది రౌడీల‌ను మ‌నం చూడొచ్చు. దీన్ని బట్టి ఈ పోస్టర్‌ ఓ యాక్షన్‌ సీక్వెన్స్ కు సంబంధించినది అని తెలుస్తుంది.

ప్రముఖ నిర్మాతలు నవీన్‌ ఏర్నేని, వై. రవిశంకర్, రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న ‘సర్కారువారి పాట’ చిత్రంలో సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు సరసన కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్న తమన్ ఈ  చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఆర్‌. మధి కెమెరామ్యాన్‌గా, మార్తాండ్‌ కె వెంకటేశ్‌ ఎడిటర్‌గా, ఎఎస్‌ ప్రకాశ్‌ ఆర్ట్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular