Saturday, March 14, 2026
Homeసినిమాశేఖర్ కమ్ముల చేతుల మీదుగా  'సత్యభామ' ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్

శేఖర్ కమ్ముల చేతుల మీదుగా  ‘సత్యభామ’ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్

కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ లో నటిస్తున్న కొత్త సినిమాకు ‘సత్యభామ’ టైటిల్ అనౌన్స్ చేశారు. ఈ చిత్రాన్ని ఆరమ్ ఆర్ట్స్ పతాకం పై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. “మేజర్” చిత్ర దర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పకులుగా వ్యవహరిస్తూ స్క్రీన్ ప్లే అందించారు. అఖిల్ డేగల దర్శకత్వం వహిస్తున్నారు. కాజల్ అగర్వాల్ పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ లో ఈ చిత్ర టైటిల్, ఫస్ట్ గ్లింప్స్ విడుదల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మాట్లాడుతూ .. “లీడర్” సినిమాకు నా దగ్గర శశికిరణ్ పనిచేశాడు. తను దర్శకుడిగా మారి రెండు పెద్ద చిత్రాలను రూపొందించాడు. “మగధీర”లో మిత్రవిందగా కాజల్ ఎప్పటికీ మనకు గుర్తుంటుంది. ఇప్పుడూ అంతే అందంగా ఉంది. పెళ్లయినా నాయికలు తమ కెరీర్ కొనసాగించాలి అనేందుకు కాజల్ నిదర్శనం. “సత్యభామ” గ్లింప్స్ చూశాను. అందులో కాజల్ క్యారెక్టరైజేషన్, డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్ అన్నారు.

హీరోయిన్ కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ..  తెలుగు సినిమా నాకు పుట్టినిల్లు లాంటిది. టాలీవుడ్ లో మళ్లీ నటిస్తుండటం ఆనందంగా ఉంది. శేఖర్ కమ్ముల గారి సినిమాల్లో హీరోయిన్స్ ను ఎంతో పవర్ ఫుల్ గా చూపిస్తారు. ఆయన సినిమాలను ఇష్టపడతాను. నా పుట్టిన రోజున మా టీమ్ ఫస్ట్ గ్లింప్స్ తో సర్ ప్రైజ్ చేయడం సంతోషంగా ఉంది. మీరు ఇచ్చే ప్రోత్సాహంతో ఎప్పటికీ గుర్తుండే ఒక మంచి సినిమాను అందిస్తాం అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular