Saturday, March 29, 2025
Homeసినిమావెబ్ సిరీస్ చేస్తోన్న వేగేశ్న సతీష్‌

వెబ్ సిరీస్ చేస్తోన్న వేగేశ్న సతీష్‌

Web Vegnesha: ‘దొంగ‌ల‌బండి’, ‘రామ‌దండు’, ‘కులుమ‌నాలి’, ‘శతమానం భవతి’, ‘శ్రీనివాస కళ్యాణం’, ‘ఎంతమంచి వాడవురా..’ లాంటి కుటుంబ కథా చిత్రాలతో దర్శకుడిగా మంచి పాపులారిటీ తెచ్చుకున్నారు వేగేశ్న స‌తీష్‌. ప్ర‌స్తుతం కోతి కొమ్మ‌చ్చి,  శ్రీ శ్రీ రాజా వారు అనే సినిమాలు చేస్తున్నారు. ఈ సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతోన్నాయి. వీటితో పాటు కథలు(మీవి-మావి) అనే వెబ్ సిరీస్ కూడా చేస్తున్నారు.

ఇప్పటికే సీనియర్ దర్శకులు, కొత్త దర్శకులు ఈ వెబ్ సిరీస్‌లను చేస్తూ.. ఓటీటీ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో దర్శకుడు వేగేశ్న సతీష్ కూడా డిజిటల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఆయన పల్లెటూరి కథలతో ఓ వెబ్ సిరీస్ రూపొందిస్తున్నారు. ఇది పూర్తిగా వేగేశ్న శైలిలో సాగే పల్లెటూరి కథలతో తెరకెక్కబోతున్న ఆంతాలజీతో కూడిన వెబ్ సిరీస్. అందుకే దీనికి కథలు(మీవి మావి) అనే టైటిల్‌ను కన్‌ఫర్మ్ చేశారు. ఇప్పటికే మూడు కథలకు సంబంధించి షూటింగ్‌ను కూడా పూర్తి చేశారు. త్వరలోనే మిగిలిన కథలకు సంబంధించిన చిత్రీకరణను పూర్తి చేయ‌నున్నారు. ఆత‌ర్వాత‌ ప్రముఖ ఓటీటీ సంస్థ ద్వారా ఈ వెబ్ సిరీస్ ను విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్