సత్యదేవ్… ప్రతి సినిమా ఓ డిఫరెంట్‌గా చేస్తూ విలక్షణమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోన్న కథానాయకుడు. పాత్ర ఏదైనా అందులో ఒదిగిపోయే నేటి తరం అతి కొద్దిమంది నటుల్లో సత్యదేవ్ ఒకరు. ‘బ్లఫ్ మాస్టర్’లో మోసాలు చేసేవాడిగా, ‘ఉమామహేశ్వరాయ ఉగ్రరూపస్య’లో విలేజ్ కుర్రాడిగా మెప్పించిన సత్యదేవ్ ఇప్పుడు అన్యాయాలను ప్రశ్నించే లాయర్ ‘తిమ్మరుసు’గా కనిపించబోతున్నారు. జూలై 30న విడుదల కాబోతున్న ఈ సినిమా ట్రైలర్‌ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ విడుదల చేసి చిత్ర యూనిట్‌ను అభినందించారు.
‘తను తెలివైనవాడే కానీ.. ప్రాక్టికల్ పర్సన్ కాదు..ఎవరైనా కేసు గెలిస్తే బైక్ నుండి కారుకి వెళతారు.. రామ్ కారు నుండి బైక్‌కి వచ్చాడు.. తనకేమో హగ్ నాకేమో షేక్ హ్యాండా…‘గుర్రం పని గుర్రం చేయాలి.. గాడిద పని గాడిద చేయాలి’ ఇలాంటి డైలాగ్స్‌తో హీరో సత్యదేవ్, హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ మధ్య లవ్, సత్యదేవ్-బ్రహ్మాజీ మధ్య ఉండే రిలేషన్ గురించి తెలియజేస్తుంటే…
‘ఎనిమదేళ్ల క్రితం జరిగిన క్యాబ్ డ్రైవర్ కేస్ కాంపెన్‌సేషన్ కేస్…’ సత్యదేవ్ ఓ అబ్బాయితో ‘అంత చిన్న వయసులో అంత పెద్ద మర్డర్ ఎలా చేశావ్? ’ అని అడగటం ‘మాటలతో చెబితే అర్థం కావట్లేదా మీకు’ అని అబ్బాయి సత్యదేవ్ పై అరవడం.. అబ్బాయి తల్లి పాత్రలో చేసిన ఝాన్సీ అబ్బాయిని ఆపటం.. ‘ఇప్పుడేం చేద్దామంటావు అని ఓ పెద్దమనిషి అడిగినప్పుడు కేసు రీ ఓపెన్ చేద్దాం’ అని సత్యదేవ్ అనటం … ఇలాంటి డైలాగ్స్ తో సినిమాలో అసలు పాయింట్ ఏంటనేది? అర్థమవుతూనే సినిమా ఎలా ఉండబోతుందనే ఆసక్తిని కలిగిస్తుంది.
ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్స్ అధినేత మహేశ్ కోనేరుతో పాటు ఎస్ ఒరిజినల్స్ బ్యానర్‌పై ‘మను’ వంటి డిఫరెంట్ చిత్రాన్ని అందించిన నిర్మాత సృజన్ ఎరబోలు ఈ చిత్రాన్ని నిర్మించారు. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించారు. రీసెంట్‌గా విడుదలైన టీజర్, ప్రమోషనల్ సాంగ్‌కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రియాంక జవాల్కర్ హీరోయిన్‌గా నటించింది. ఇప్పుడు ట్రైలర్ కు అనూహ్యమైన స్పందన లభిస్తుంది. మరి.. సినిమా కూడా అందర్నీ ఆకట్టుకుని విజయం సాధిస్తుందని టీమ్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు.