Sunday, September 22, 2024
HomeTrending Newsనవంబర్ 15న గులాబీ విజయ గర్జన

నవంబర్ 15న గులాబీ విజయ గర్జన

టీ ఆర్ ఎస్ అధ్యక్ష ఎన్నిక కు షెడ్యూల్ విడుదల చేస్తున్నామని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటిఆర్ ప్రకటించారు. ఈ నెల 17వ తేదిన నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుందని, 22వ తేది దాకా నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుందన్నారు. హైదరాబాద్ తెలంగాణ భవన్ లో ఈ రోజు జరిగిన మీడియా సమావేశంలో కేటిఆర్ ఎన్నిక వివరాలు వెల్లడించారు. ఈ నెల 23వ తేదిన నామినేషన్ల పరిశీలన ఉంటుందని, 24వ తేది లోగా నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుందన్నారు. జిల్లా అధ్యక్షుల ఎన్నిక  తర్వాతే పార్టీ అధ్యక్ష ఎన్నిక ఉంటుందన్నారు.

పార్టీ అధ్యక్షుల ఎన్నిక ఈ నెల 25వ తేదిన పూర్తి అయిన తర్వాత జరిగే పార్టీ జనరల్ బాడీ సమావేశంలో ప్లీనరీకి సంబంధించి వివిధ అంశాలపైన పార్టీ అధ్యక్షులు దిశా నిర్దేశం చేస్తారని మంత్రి కేటిఆర్ చెప్పారు. ఇందుకు 14 వేల మందిని ఆహ్వానిస్తున్నామన్నారు. ప్లీనరీ సమావేశంలో ప్రవేశపెట్టే తీర్మానాల కమిటీ అధ్యక్షులుగా పార్టీ సీనియర్ నాయకులు, మాజీ శాసన సభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి వ్యవహరిస్తారు.

పార్టీ అధ్యక్ష ఎన్నిక ప్రక్రియకు రిటర్నింగ్ ఆఫీసర్ గా పార్టీ కార్యాలయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి, ఎన్నిక ప్రక్రియ మొత్తాన్ని పార్టీ సీనియర్ నాయకులు పర్యాద కృష్ణమూర్తి, పార్టీ జనరల్ సెక్రటరీ సోమ భరత్ పర్యవేక్షిస్తారు. అక్టోబర్ 27వ తేదిన ద్విదశాబ్ది సభ సన్నాహక సమావేశం తెలంగాణ భవన్ లో జరుగుతుందని, నవంబర్ 15వ తేదిన వరంగల్ లోపార్టీ విజయ గర్జన సభ వరంగల్ లో నిర్వహిస్తున్నామని కేటిఆర్ వివరించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్