Tuesday, May 6, 2025
HomeTrending Newsఆగస్టు 16 నుంచి స్కూళ్ళు

ఆగస్టు 16 నుంచి స్కూళ్ళు

రాష్ట్రంలో ఆగస్టు 16నుంచి పాఠశాలలు పునః ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది.  ప్రభుత్వ స్కూళ్ళలో నాడు-నేడు తొలి విడత పనులను అదేరోజు జాతికి అంకితం చేసి, రెండో విడత పనులకు శ్రీకారం చుట్టాలని, దీనికి తగిన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖలో నాడు–నేడు, అంగన్‌వాడీలపై  సిఎం సమీక్ష నిర్వహించారు. నూతన విద్యా విధానంపై ఆగస్ట్ 16న ప్రజలకు సమగ్రంగా వివరించనుంది ప్రభుత్వం. విద్యార్థులకు ‘విద్యా కానుక’ కిట్లు అందజేస్తారు.

ఈసారి విద్యార్ధులకు కిట్ తో పాటు డిక్షనరీ కూడా అందిస్తామని విద్యా శాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు.  మొదటి విడతలో జరిగిన నాడు-నేడు పనులపై సిఎం జగన్ సంతృప్తి వ్యక్తం చేశారని సురేష్ వెల్లడించారు. 16 వేల కోట్ల రూపాయలతో రెండో విడతలో స్కూళ్ళు, కాలేజీలను ఆధునీకరిస్తామన్నారు.

ఈ ఏడాది కూడా ఇంటర్, డిగ్రీ అడ్మిషన్లు ఆన్ లైన్ లోనే నిర్వహిస్తామని, విద్యా సంస్థల్లో కోవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. విద్యాసంస్థల్లో అక్రమంగా ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్