My Name is Shruthi: ఇండియన్ స్క్రీన్ పై ఇప్పటి వరకు రాని ఓ వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో, భిన్నమైన నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘మై నేమ్ ఈజ్ శృతి’. మనిషి చర్మం వలిచి బిజినెస్ చేసే ఓ గ్యాంగ్‌తో ఓ యువతి చేసే పోరాటమే మా చిత్రం అంటున్నారు చిత్ర దర్శకుడు శ్రీనివాస్ ఓంకార్. ప్రముఖ కథానాయిక హాన్సిక టైటిల్ రోల్ పోషిస్తుంది.
ఇటీవలి టీజర్‌లో ‘చర్మం వలిచి బిజినెస్ చేస్తానమంటున్నారు ఏం చేయాలి వాళ్లను’ అంటూ కథానాయిక హాన్సిక చెప్పే డైలాగ్‌తో చిత్రంపై క్యూరియాసిటీ పెరిగింది. లేడి ఓరియెంటెడ్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వైష్ణవి ఆర్ట్స్ పతాకం పై బురుగు రమ్య ప్రభాకర్ నిర్మిస్తున్నారు. టీజర్ కు చక్కని స్పందన వచ్చింది. ఈ చిత్రంలోని ‘రెప్పే వేసేలోగా మారిందేమో నా రాత.. తప్పే చేసే లాగా ముప్పే వచ్చే నా వెంట’ అంటూ కొనసాగే లిరికల్ వీడియోను విడుదల చేశారు. మార్క్‌రాబీన్ సంగీత దర్శకత్వంలో కృష్ణకాంత్ (కెకె) సాహిత్యం అందించిన ఈ గీతాన్ని హారిక నారాయణ ఆలపించారు.
హాన్సిక మాట్లాడుతూ.. “ఈ చిత్రంలో నటించినందుకు ఎంతో ఆనందంగా వుంది. ఇలాంటి ఓ ఇంటెన్స్ స్టోరీని నేను ఎప్పుడూ చేయలేదు. సినిమాలో వుండే ట్విస్ట్‌లు అందరిని ఆశ్చర్యపరుస్తాయి. ఈ చిత్రంలో ఈ పాట టైటిల్ సాంగ్‌గా వస్తుంది. తప్పకుండా ఈ సాంగ్‌తో పాటు చిత్రం కూడా అందర్ని అలరిస్తుందనే నమ్మకం వుంది” అన్నారు.
Also Read : ‘మై నేమ్ ఈజ్ శృతి’ ఫస్ట్ లుక్ & టీజర్ విడుదల