Friday, March 20, 2026
Homeసినిమావిడుద‌ల‌కు సిద్ద‌మైన 'సెహ‌రి'

విడుద‌ల‌కు సిద్ద‌మైన ‘సెహ‌రి’

Sehari – Ready to hit:
హర్ష్‌ కనుమిల్లి, సిమ్రాన్‌ చౌదరి హీరో హీరోయిన్లుగా జ్ఞానసాగర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘సెహరి’. వర్గో పిక్చర్స్‌ పతాకంపై అద్వయ జిష్ణు రెడ్డి, శిల్పా చౌధ‌రి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్ 60 లక్షల వ్యూస్ పొందగా, సెహరి టైటిల్ సాంగ్, “ఇది చాలా బాగుందిలే” యువతను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా “ఇది చాలా బాగుందిలే” అనే పాట 80 లక్షల వ్యూస్ పొంది శరవేగంగా కోటి వ్యూస్ వైపు దూసుకుపోతోంది.

ఈ సంద‌ర్భంగా నిర్మాత అద్వయ జిష్ణు రెడ్డి మాట్లాడుతూ “సెహ‌రి టీజర్ మరియు పాటల‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ముఖ్యంగా హీరో హర్ష్ కనుమిల్లి నటన చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటున్నది. అంతే కాకుండా ఎక్కడ కూడా మొదటి సారిగా నటించినట్టుగా కాక ఎంతో అనుభవంతో నటిస్తున్నట్టుగా చాలా అధ్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఉన్నత నిర్మాణ విలువలతో నిర్మించబడిన “సెహరి” సినిమా కుటుంబ సమేతంగా వెళ్ళి హాయిగా నవ్వుకుని ఆనందించదగ్గ సినిమా అవుతుంది” అని ధీమా వ్యక్తం చేశారు.

దర్శకుడు జ్ఞానసాగర్ ద్వారక మాట్లాడుతూ “ఈ చిత్రంలోని కథ, పాత్రలు అన్నీ యువత, కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దాం” అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular