Sunday, January 19, 2025
Homeసినిమా‘మహావీరుడు’ కూడా అంతే ప్రత్యేకంగా ఉంటుంది - శేఖర్ కమ్ముల

‘మహావీరుడు’ కూడా అంతే ప్రత్యేకంగా ఉంటుంది – శేఖర్ కమ్ముల

శివ కార్తికేయన్ కథానాయకుడిగా, మడోన్ అశ్విన్ దర్శకత్వంలో నటించిన ఫాంటసీ యాక్షన్ ఎంటర్ టైనర్’ మహావీరుడు. అదితి శంకర్‌ కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని శాంతి టాకీస్‌ పతాకం పై అరుణ్‌ విశ్వ నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ, పంపిణీ సంస్థ ఏషియన్ సినిమాస్ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా రిలీజ్ చేస్తోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. జూలై 14న మహావీరుడు విడుదల కానున్న నేపథ్యంలో ప్రీరిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించారు. హీరో అడివి శేష్, స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో శివ కార్తికేయన్ మాట్లాడుతూ.. శేఖర్ కమ్ముల గారి హ్యాపీ డేస్ సినిమా నాకు చాలా ఇష్టం. అడవి శేష్ ని చూస్తునపుడు ఒక బ్రదర్ లా అనిపిస్తారు. కథ కుదిరితే తనతో కలసి నటిస్తాను. గూడచారి 2 కోసం ఎదురుచూస్తున్నాను. అనుదీప్ కి థాంక్స్. మహావీరుడు ఫాంటసీ జోనర్. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుంది. దర్శకుడు అశ్విన్ బ్రిలియంట్ గా తీశారు. సునీల్ గారు చాలా మంచి వ్యక్తి. ఆయనతో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను.  అదితి చక్కగా నటించింది. సరిత గారితో పని చేయడం ఆనందంగా వుంది. ఏసియన్ సునీల్ గారికి, జాన్వి కి కృతజ్ఞతలు. ఈ సినిమాలో చాలా మంచి సర్ప్రైజ్ వుంది. అందరూ థియేటర్ కి వెళ్లి సినిమా చూడండి. కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమా మీ అందరినీ కొత్తగా ఎంటర్ టైనర్ చేస్తుంది. రెమో, వరుణ్ డాక్టర్,  కాలేజ్ డాన్ ని ఎలా అయితే ఇష్టపడ్డారో.. ఈ మహవీరుడుని కూడా అలానే ఇష్టపడతారు. జులై 14న ఫ్యామిలీతో కలసి ఈ సినిమా చూడండి. తప్పకుండా సినిమా అందరినీ అలరిస్తుంది. అందరికీ కృతజ్ఞతలు.’’ తెలిపారు.

శేఖర్ కమ్ముల మాట్లాడుతూ.. ముందుగా దర్శకుడు అశ్విన్ కి అభినందనలు. తన మండేలా సినిమా చూశాను. చాలా ముఖ్యమైన సినిమా అది. మహావీరుడు కూడా అంతే ప్రత్యేకంగా వుంటుందని భావిస్తున్నాను. శివకార్తికేయన్ గారిని చూస్తున్నపుడు మనలో ఒకరే అనిపిస్తుంది. మహావీరుడు ట్రైలర్ విజువల్స్ గొప్పగా వున్నాయి. సరిత గారి సినిమాలు చూస్తూ పెరిగాం. ప్రేమకథ అంటే మరో చరిత్ర. మ్యూజిక్ అంటే మరో చరిత్ర. సరిత గారితో కలసి వేదిక పంచుకోవడం ఆనందంగా వుంది. నిర్మాత అరుణ్ కి బెస్ట్ విషెస్. సునీల్ నారంగ్ గారు, జాన్వీ, భరత్ ,  టీం అందరికీ ఆల్ ది బెస్ట్ . మహావీరుడు లో గ్రేట్ వైబ్ కనిపిస్తోంది. సినిమా కోసం  ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’ అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్